Asianet News TeluguAsianet News Telugu

#Gaalodu: 'గాలోడు' OTT రేటు...ఇంత పలికిందేంటి సామీ

థియేట్రికల్ రన్ ద్వారా 1.5 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. అలాగే ఈ సినిమాకి డిజిటల్ రైట్స్   సాలిడ్ రేటు పలికిందని సమాచారం. 

Sudi gaali Sudheer Gaalodu Ott Deal details
Author
First Published Dec 4, 2022, 4:57 PM IST


పెద్ద హీరోల సినిమాలు సైతం  బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్న ఈరోజుల్లో..ఒక బుల్లితెర స్టార్ సినిమాకి జనాలు నీరాజనం పట్టడం ట్రేడ్ ని షాక్ కు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం రిలీజైన  సుడిగాలి సుధీర్ ‘గాలోడు’భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. ఏదో గాలివాటు చిత్రం అనుకుంటే ఈ సినిమా  భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. బి,సి సెంటర్లలో ఈ సినిమాకు ఎదురే లేకుండా పోయింది. ఈ సినిమా మాత్రం కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది.

పెట్టిన బడ్జెట్ మీద థియేట్రికల్ రన్ లోనే మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్. సినిమా ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ద్వారా 1.5 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి రేడీ అవుతోంది.థియోటర్ లో బాగా వర్కవుట్ అవటంతో  ఈ సినిమాకి డిజిటల్ రైట్స్   సాలిడ్ రేటు పలికిందని సమాచారం.  దాదాపు 1.40 కోట్ల దాకా  డిజిటల్ రిలీజ్ కి గాను ఇచ్చారని సమాచారం. అంటే ఆల్ మోస్ట్ బడ్జెట్ లో సగం వరకు ఇక్కడే రికవరీ అయ్యినట్లే.
 
ఆహా వీడియో వాళ్ళు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇంకా శాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత వరకు పలుకుతాయో అనేది ట్రేడ్ లెక్కలు వేస్తోంది. మొదటి వారం డివైడ్  టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని ఎదుర్కొని నిలబడటమే కాకుండా ఓ రేంజిలో పోటీ ఇచ్చింది.  

 ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే మంచి హోల్డ్ ని చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం…ట్రేడ్ ని ఆశ్చర్య పరుస్తోంది. సినిమా చూసిన ఓ వర్గం గొప్పగా ఏమీ లేదు..జస్ట్ ఓకే అన్నా..... నెగటివ్ టాక్ వచ్చినా  మొదటి వారం కూడా పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా గొప్ప విషయం.
 

Follow Us:
Download App:
  • android
  • ios