‘మామ మశ్చీంద్ర’ షాకింగ్ OTT ట్విస్ట్, అసలు ఊహించం

కొన్ని కామెడీ సీన్లు తప్పిస్తే దర్శకుడిగా, రచయితగా హర్షవర్ధన్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.  సుధీర్ బాబు ఖాతాలో మరొక ఫ్లాప్ గా నిలిచిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్సైంది. 

Sudheer Babu starrer Mama Mascheendra OTT release date jsp


 హీరో సుధీర్ బాబు (Sudheer Babu) త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం  మామా మశ్చీంద్ర(Mama Mascheendra Movie). నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాను.. సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు సమ్యుక్తంగా నిర్మించారు.  టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆసక్తి పెంచిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై సుధీర్ బాబు బాగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే మార్నింగ్ షోకే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయని ట్రేడ్ అంటోంది. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది. మామా మశ్చీంద్ర ఈ అక్టోబర్ 20న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరగబోతోంది. నెల కూడా కాకుండా కేవలం పదిహేను రోజుల గ్యాప్ లో సుధీర్ బాబు వంటి స్టార్ హీరో సినిమా ఓటిటిలో రావటం ఆశ్చర్యంలో పడేస్తోంది. 


స్టోరీ లైన్

డబ్బుకోసం ఎంతకైనా తెగించే దుర్మార్గుడు పరశురామ్ (సుధీర్ బాబు). అందుకు అతనికో ప్లాష్ బ్యాక్ ఉంటుందనేది ప్రక్కన పెడితే ప్రస్తుతం తన చెల్లి దగ్గర ఉన్న  వందల కోట్ల ఆస్తి పై కన్నేస్తాడు. అందుకోసం  చెల్లెలు, ఆమె భర్తతో పాటు పిల్లల్ని చంపమని తన మనిషి దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. అయితే...సినిమాటెక్ గా  వాళ్ళు తప్పించుకుంటారు. కొంతకాలం అయ్యాక  పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడుతుంది. మరో ప్రక్క జాబ్  కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కూతురు  మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడుతుంది. అయితే ఈ ఇద్దరు సుధీర్ బాబులు మరెవరో కాదు తన పోలికే వచ్చిన తన మేనల్లుళ్లు అనే విషయం తెలుసుకుంటాడు పరుశరామ్. వాళ్ల ఆస్ది ని ఆక్రమించాననే కోపంతో తన మేనళ్లళ్లు ఇద్దరూ తన కూతురుని, తన దగ్గర పనిచేసే దాసు కూతురుని ప్రేమలో పడేసారని డౌట్ పడతాడు. అయితే ఆ అనుమానం నిజమేనా...అలాగే కూతుళ్ల విషయంలో ఓ ట్విస్ట్ ఉంటుంది.అది  ఏమిటి? చివరకు తన మేనల్లుళ్లు ఇద్దరినీ పరుశురామ్ ఏం చేసాడు..చివరకు ఏమైంది అనేది మిగతా కథ.   

 
కథను ఆసక్తికరంగా మలచడంలో ఫెయిల్ అయ్యారు. హర్షవర్ధన్ కన్ఫ్యూజన్ కామెడీని చాలా బాగా డీల్ చేయగలడు అనుకుంటే బోల్తా కొట్టింది.  కన్ఫ్యూజన్ డ్రామా తీద్దాం అనుకున్న దర్శకుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాడని రివ్యూలు వచ్చాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios