Asianet News TeluguAsianet News Telugu

‘హంట్‌’ భాక్సాపీస్ పరిస్దితి ఏమిటి?

 హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తద‌నంతో కూడిన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు

Sudheer babu hunt film reported deficits in almost all the theaters
Author
First Published Jan 29, 2023, 12:47 PM IST

‘‘హంట్‌’ (Hunt) ప్రతి హీరో ప్రయత్నించే కథ కాదు. నేనిలాంటి కథ చేయడాన్ని ప్రేక్షకులు స్వీకరిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు రిలీజ్ కు ముందు సుధీర్‌బాబు (Sudheer Babu).సుధీర్‌బాబు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మహేష్‌ (Mahesh) తెరకెక్కించారు. శ్రీకాంత్‌ (Srikanth), భరత్‌ (Bharath) కీలక పాత్రలు పోషించారు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆయన భయమే నిజమైంది. ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చూసిన కొద్ది మంది బాగా చేసావు అంటున్నారు కానీ కలెక్షన్స్ పికప్ కావటం లేదంటోంది ట్రేడ్.

 ఇందులో సుధీర బాబు అర్జున్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. ఈ పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. గతం మర్చిపోవడానికి ముందు.. అర్జున్‌ ఎ పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా ఉంటుంది. కానీ, గతం మర్చిపోయిన తర్వాత.. అర్జున్‌ బి పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది.  ఈ పాత్రే కొంచెం కష్టమైంది. మెమోరీ లాస్‌ మీద వచ్చిన ‘గజినీ’ లాంటి పాత్రలకు పోలిక ఉండకూడదని కొత్తగా ప్రయత్నం చేశారు కానీ ఫలితం పెద్దగా కనపించటం లేదు. మళయాళ చిత్రం ముంబై పోలీస్ రీమేక్ గా ఈ చిత్రం  క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించనది అయినా దానికి పూర్తి స్దాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రావటం లేదు.
 
 హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ..  ‘‘హంట్‌’ (HUNT) ఓ విభిన్నమైన చిత్రం. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని భయపడ్డాం. కానీ, ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరూ అద్భుతమని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చివరి 30నిమిషాలు అద్భుతమని చెబుతున్నారు. అందరికీ కృతజ్ఞతలు. నేనిప్పటి వరకు అన్నీ విభిన్నమైన సినిమాలే చేశాను. ఇకపైనా అలాగే చేస్తాను. రెగ్యులర్‌ చిత్రాలు చేయను’’ అన్నారు. ‘‘కంటెంట్‌ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. సుధీర్‌బాబు కొత్తగా ప్రయత్నించారు’’అన్నారు నటుడు భరత్‌. దర్శకుడు మహేష్‌ మాట్లాడుతూ.. ‘‘నేనప్పటికీ గర్వపడే సినిమా ఇది. తెలుగులో ఇలాంటి చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈతరహా పాత్రని సుధీర్‌ చేసినందుకు అందరూ మెచ్చుకుంటున్నారు’’ అన్నారు.

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తద‌నంతో కూడిన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. మొద‌టి నుండి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్న‌ సుధీర్ బాబుకు ‘స‌మ్మోహ‌నం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్‌ వచ్చిన కలెక్షన్లు మాత్ర ఆశించిన స్థాయిలో రాలేకపోతున్నాయి. హాంట్ పరిస్దితి అదే. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాల‌ను సెట్స్‌పైన ఉన్నాయి
 

Follow Us:
Download App:
  • android
  • ios