జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుడిగాలి సుధీర్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మంచి టైమింగ్ తో కామెడీ పంచులు పేల్చడంలో సుధీర్ దిట్ట. ఇక జబర్దస్త్ లోనే రష్మీ కూడా యాంకర్ గా పాపులర్ అయింది. వెండి తెరపై బోల్డ్ చిత్రాల్లో నటించేందుకు కూడా రష్మీ వెనుకాడడం లేదు. గత కొన్ని రోజులుగా సుధీర్, రష్మీలపై రూమర్స్ ఎప్పుడూ ఉండేవే. తాజాగా మరో ఆసక్తికర ప్రచారం వీరిద్దరి గురించి జరుగుతోంది. 

బిగ్ బాస్ 3 జాబితాలో వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయట. కానీ సుధీర్, రష్మీ మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. వివిధ షోలతో తామిద్దరం బిజీగా ఉన్నాం అని చెబుతున్నారట. ఎలాగైనా వీరిద్దరూ బిగ్ బాస్ 3లో పాల్గొనేలా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వీరిద్దరిని ఎలాగైనా తీసుకురావడం కోసం మిగిలినవారికంటే కాస్త ఎక్కువగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడానికి కూడా బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధపడినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో, సుధీర్, రష్మీతో బేరసారాలు జరుపుతున్నారట. బిగ్ బాస్ 3 నిర్వాహకుల ఆఫర్ కు సుధీర్, రష్మీ ఓకే చెబుతారో లేదో చూడాలి. ఈ షోకు, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బిగ్ బాస్ 3 గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.