Asianet News TeluguAsianet News Telugu

'పహిల్వాన్' మూవీ రివ్యూ!

ఆ మధ్యన సల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే కుస్తీ పోటీల మధ్య జరిగే స్పోర్ట్స్ డ్రామాతో ఓ సినిమా తీసాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ దంగల్ అంటూ మరో కుస్తీ పోటీలతో సాగే సినిమా చేసాడు.  అయితే మన సౌత్ లో మాత్రం ఆ తరహా కుస్తీ పట్లు పట్టే సినిమా రాలేదు. ఆ విషయం సుదీప్ గమనించినట్లున్నాడు. కుస్తీ అనే పదంలోనే బోలెడంత యాక్షన్ ఉందని భావించి ‘పహిల్వాన్’టైటిల్ తో ఓ సినిమా చేసేసాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా సీజన్ నడుస్తోంది. ఒక భాషలో తీసిన సినిమా అన్ని ప్రధాన భాషల్లోకి డబ్ చేసి దేశం మొత్తం రిలీజ్ చేయటం. అదే పని ‘పహిల్వాన్’ కూడా చేసింది. 

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Sudeep's Pahilwaan  telugu Movie Review
Author
Hyderabad, First Published Sep 12, 2019, 5:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆ మధ్యన సల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే కుస్తీ పోటీల మధ్య జరిగే స్పోర్ట్స్ డ్రామాతో ఓ సినిమా తీసాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ దంగల్ అంటూ మరో కుస్తీ పోటీలతో సాగే సినిమా చేసాడు.  అయితే మన సౌత్ లో మాత్రం ఆ తరహా కుస్తీ పట్లు పట్టే సినిమా రాలేదు. ఆ విషయం సుదీప్ గమనించినట్లున్నాడు. కుస్తీ అనే పదంలోనే బోలెడంత యాక్షన్ ఉందని భావించి ‘పహిల్వాన్’టైటిల్ తో ఓ సినిమా చేసేసాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా సీజన్ నడుస్తోంది. ఒక భాషలో తీసిన సినిమా అన్ని ప్రధాన భాషల్లోకి డబ్ చేసి దేశం మొత్తం రిలీజ్ చేయటం. అదే పని ‘పహిల్వాన్’ కూడా చేసింది. అయితే నిజంగా ఈ సినిమాకు అంత సీన్ ఉందా..ఈ సినిమా కథేంటి...ఈ ‘పహిల్వాన్’ పట్టే కుస్తీలు అందరికీ నచ్చి జేజేలు కొట్టించుకుంటాయా...మరీ ముఖ్యంగా మనకు ఈగ సినిమాలో విలన్ గా పరిచయం అయిన సుదీప్ ఈ సినిమాలో హీరో.. ఆ విధంగా మనకు పరిచయం ఉన్న ఈ కన్నడ నటుడు ఇక్కడా తన జెండా ఎగరేస్తాడా ఈ సినిమాతో అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే...

అనాధ కృష్ణ (సుదీప్) తన ఆకలి తీరటం కోసం చేస్తున్న పోరాటాలు చూసి, వీడిలో ఏదో విషయం ఉందని చేరదీస్తాడు ప‌హిల్వాన్ స‌ర్కార్‌(సునీల్ శెట్టి) . తనతో పాటే తిప్పుకుంటూ కుస్తీ ట్రైనింగ్ ఇస్తాడు. ఆ క్రమంలో చుట్టు ప్రక్కల ఊళ్లలో పేరున్న పహిల్వాన్ అవుతాడు కృష్ణ. అయితే అదే సమయంలో అతను రుక్మిణి(ఆకాంక్ష సింగ్‌)తో ప్రేమలో పడతాడు. కానీ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ప్రేమ, పెళ్లి అంటున్న కృష్ణ పద్దతి సర్కార్ కు నచ్చక హెచ్చరిస్తాడు.

కానీ కృష్ణ దాన్ని లైట్ తీసుకుని ఓ కుస్తీ పోటీలో తను ఇష్టపడ్డ అమ్మాయిని గెలుచుకుని పెళ్లి చేసుకుంటాడు. అది చూసిన సర్కార్ ఆగ్రహంతో ఊగిపోతాడు. నువ్వు శిష్యుడువే కాదు..నా దగ్గర నేర్చుకున్న విద్య ని వదిలేయి..జీవితంలో  ఎప్పుడూ కుస్తీ పట్టకు అంటాడు. దాంతో కృష్ణ తన భార్య రుక్మిణిని తీసుకుని ఊరు వదిలివెళ్లిపోతాడు. అలాంటివాడు తిరిగి మళ్లీ కుస్తీ పోటికీ రావాల్సిన పరిస్దితిలు వస్తాయి. ఆ కారణం ఏమిటి..కృష్ణ తన కుస్తీతో ఓడించాల్సిన  టోనీ (కబీర్ దుహన్ సింగ్) ఎవరు...తన గురువు మళ్లీ కృష్ణని చేరతీస్తాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...

ఫక్తు ఫార్ములా స్పోర్ట్స్ స్టోరీ. రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు..ఆ తర్వాత పదో సీన్ లో ఏమి వస్తుందో గెస్ చేసేయగలుగుతారు.  క‌థ ప‌రంగా చూస్తే ఎక్కడా పొరపాటువ కూడా కొత్త‌గా ట్విస్టులు, ట‌ర్న్‌లంటూ ఏమీ క‌న‌ప‌డ‌వు. కేవలం  హీరో క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని దాని చుట్టూ కథనం అల్లి తెర‌కెక్కించారు.అలాగే సినిమాలో ఎక్కువ భాగం హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డం కోస‌మే టైమ్ ని కేటాయించారు.

ఫ‌స్టాఫ్ అంతా హీరో  కుస్తీ పోటీల్లో ఎద‌గాల‌నుకోవ‌డం, హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్‌.. గురు శిష్యుల మ‌ధ్య అనుబంధంతో నడుస్తుంది. సెకండాఫ్ హీరో కుస్తీల‌ను వ‌దులుకుని బాక్స‌ర్ కావాల‌నుకోవ‌డం పై కాన్సర్టేట్ చేసారు. అయితే స్పోర్ట్స్ సినిమాలు మనకు తక్కువ కాబట్టి ఆ యాంగిల్ లో ఉత్సాహపడాలి. ఏదైమైనా ఈ  సినిమా సుదీప్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అని అంచనా వేసుకుని ఆ విధంగా తీసిన సినిమా అని అర్దమవుతుంది.

టెక్నికల్ గా ...

‘ఈగ’ సినిమాతో మనకు దగ్గర అయిన కిచ్చా సుదీప్ ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’గా కుస్తీ వీరుడి పాత్ర‌లో జీవించాడు అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా తన సిక్స్ ప్యాక్ తో  క్లైమాక్స్ భాక్సింగ్ సీన్ లో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కరుణాకర్ సినిమాటోగ్రఫీ బాగుంది.  

ఇక సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత స్వప్న కృష్ణ నిర్మాణ విలువలు  కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు కథతో కూడా కుస్తీ పట్టాల్సింది.

ఫైనల్ థాట్

ఫ్యాన్స్ కోసం తీసే సినిమాలు ఫ్యాన్ ఇండియా చిత్రాలు అవ్వటం కష్టమే.

Rating:2.5
 

Follow Us:
Download App:
  • android
  • ios