సాయి పల్లవి ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. ఆమె నుండి కొత్త చిత్రాల ప్రకటన ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై బిజీ కావాలని కోరుకుంటున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో సాయి పల్లవికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నేచురల్ బ్యూటీకి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సత్తా ఉంది. అందుకే దర్శక నిర్మాతలు ఆమె వెనుకబడుతున్నారు. ఆమె సైన్ చేస్తే కోరిన రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాల్లో పెట్టుకునే నిర్మాతలు ఉన్నాయి. అలాంటి సాయి పల్లవి కొత్త చిత్రాల ప్రకటన చేయడం లేదు. సడన్ గా ఆమె సైలెంట్ అయ్యారు.
సాయి పల్లవి ట్రాక్ చూస్తే చాలా సక్సెస్ ఫుల్ గా ఉంది. ఆమె చివరి మూడు చిత్రాల్లో రెండు సూపర్ హిట్ అయ్యాయి. నాగ చైతన్యకు జంటగా లవ్ స్టోరీ మూవీ చేయగా హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి పల్లవి నటన టాప్ క్లాస్ అని చెప్పాలి. నానికి జంటగా చేసిన శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. పీరియాడిక్ పాత్రలో దేవదాసిగా సాయి పల్లవి అబ్బురపరిచింది.
విరాటపర్వం మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా విడుదలైన విరాటపర్వం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. ఇక సాయి పల్లవి లేటెస్ట్ మూవీ గార్గి. సోషల్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కింది. గార్గి అనంతరం సాయి పల్లవి మరో మూవీ ప్రకటించలేదు. పుష్ప పార్ట్ 2లో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నా... అధికారిక సమాచారం లేదు. చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవికి ఆఫర్స్ రావడం లేదా? లేక ఆమె ఒప్పుకోవడం లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.
కాగా సాయి పల్లవి అరుదైన హీరోయిన్. ఆమె పాత్ర నచ్చకుండా సినిమా ఒప్పుకోరు. గ్లామర్ రోల్స్ కి దూరం. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తారు. రెమ్యునరేషన్ కి కక్కుర్తి పడి సినిమాలు చేసే రకం కాదు. ఆ కారణంగా కూడా సాయి పల్లవికి అవకాశాలు తగ్గి ఉండవచ్చు.
