Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 7: శుభ శ్రీ ఎలిమినేట్‌.. షాక్‌లో బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్‌ అవుతున్నారు. ఇప్పటికే నలుగురు అమ్మాయిలు హౌజ్‌ నుంచి వెళ్లిపోగా, ఐదో వారం కూడా అమ్మాయే కావడం గమనార్హం. 

subha shree eliminated from bigg boss 7 all are in shock arj
Author
First Published Oct 8, 2023, 7:30 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ ఉల్టా పుల్టా అని బిగ్‌బాస్‌, హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే అంతా ఉల్టాపుల్టా జరుగుతుంది. ఐదో వారం ఎలిమినేషన్‌ కూడా విచిత్రంగా జరిగింది. ముందు ఎలిమినేషన్‌తోనే షో స్టార్ట్ కావడం విశేషం. ఈ వారం నామినేషన్‌లో ఎడుగురు ఉన్నారు. వీరిలో శివాజీ, తేజ, అమర్‌దీప్‌, గౌతంకృష్ణ, ప్రియాంక, యావర్‌, శుభశ్రీ ఉన్నారు. అయితే నాగ్‌ ఎంట్రీ తోనే ఎలిమినేషన్‌తో ఈ ఎపిసోడ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. 

నామినేషన్లలో ఉన్న ఏడుగురుని చీకటి గదిలోకి తీసుకెళ్లి భయపెట్టి మరీ ఎలిమినేట్‌ చేశారు. యావర్‌ని, తేజని, గౌతమ్‌, శుభశ్రీలను టచ్‌ చేసిన దెయ్యం. చివరికి శుభశ్రీ ని తీసుకెళ్లిపోయింది దెయ్యం. దీంతో అంతా షాక్‌ అయ్యారు. ఐదో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్‌ కావడం గమనార్హం. దీంతో ఆమె కూడా షాక్‌ అయ్యింది. ఈ సందర్భంగా తన జర్నీ చూసుకుని ఎమోషనల్‌ అయ్యింది. అనంతరం కంటెస్టెంట్ల గురించి స్వీట్ మెమరీస్‌, బ్యాడ్ మెమరీస్‌ని షేర్‌ చేసుకుంది శుభశ్రీ. 

దీంతో ప్రస్తుతం హౌజ్‌లో కన్ఫమ్‌ అయిన సందీప్‌, శోభా శెట్టి, ప్రశాంత్‌ తోపాటు శివాజీ, ప్రియాంక, యావర్‌, అమర్‌ దీప్‌, తేజ, గౌతమ్‌ కృష్ణ ఉన్నారు. వీరిలో మరో ఎలిమినేషన్‌ ఉండబోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios