అల్లు అర్జున్‌ పుట్టిన రోజు(ఏప్రిల్‌8) సందర్భంగా ఆయనకి సంబంధించిన అఫీషియల్‌ బర్త్ డే సీడీపీ వచ్చింది. టాలీవుడ్‌కి చెందిన నలభై మందికి పైగా హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు కలిసి ఒకేసారి బన్నీ బర్త్ డే సీడీపీని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వీరంతా ట్వీట్టర్‌ ద్వారా బర్త్ డే కామ్‌ డీపీని షేర్‌ చేస్తూ ముందస్తుగానే బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందులో సర్వ శిక్ష అభియాన్‌ భాగం కావడం విశేషం. ఇక ఈ బర్త్ డే సీడీపీలో `అల వైకుంఠపురములో` లుక్‌లో టైటిల్‌ వద్ద బన్నీకనిపిస్తుంది. మెయిన్‌ ఫోటోగా గెడ్డంతో స్టయిలీష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు బన్నీ. బ్యాక్‌గ్రౌండ్‌లో `ఏఏ` అనే సింబల్‌ ఉంది. మరోవైపు అడవి, గ్రీనరీ కనిపిస్తుంది. బన్నీ నటించిన సినిమాల పోస్టర్లు ఉన్నాయి. `హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్‌` టైటిల్‌ కింద `గో గ్రీన్‌ విల్‌ ఏఏ` అనే యాష్‌ ట్యాగ్‌ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ బన్నీ బర్త్ డే సీడీపీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

ఇక ఈ సీడీపీ విడుదల చేసిన వారిలో సుకుమార్‌, కొరటాల శివ,హరీష్‌ శంకర్‌, మారుతి, రానా, సురభి, మంచు మనోజ్‌, శ్రీముఖి, శ్రీను వైట్ల, ప్రగ్యాజైశ్వాల్‌, మంచు విష్ణు, పాయల్‌రాజ్‌పుత్‌, శ్రీ విష్ణు, నాగ్‌ అశ్విన్‌, గోపీచంద్‌ మలినేని, కృతి శెట్టి, గుణటీమ్‌ వర్క్, మైత్రీ మూవీస్‌, సుమంత్‌, ఈషా రెబ్బా, తమన్నా, గౌతమ్‌ తిన్ననూరి, సుశాంత్‌, నిఖిల్‌ వంటి వారున్నారు. ఇందులో పలు నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. ఇదొక అరుదైన రికార్డ్ గా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే `పుష్ప` చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాలు మంగళవారం స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. రేపు బుధవారం పుష్పరాజ్‌ పరిచయం ఉంటుందని పేర్కొన్నారు.