ఈ వీడియో ద్వారా వారి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గత కొంతకాలంగా సినిమాల్లో కాకుండా ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్(Kanal kannan).. పేరు వార్తల్లో తెగ నలుగుతోంది. ఏదో విధంగా వివాదంలో ఇరుక్కుంటున్నాడు. ఒకటైమ్ లో తెలుగు,తమిళ ,కన్నడంలో సినిమా అంటే కనల్ కన్నన్ ఉండాల్సిందే. ఆ స్దాయి పేరు తెచ్చుకున్నాడు. చాలా ఫేమస్. ముఖ్యంగా తమ సినిమాలో స్టార్ హీరో ఉన్నారంటే కనల్ కన్నన్ మాస్టర్ ని తీసుకునేవారు. రజినీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal haasan), చిరంజీవి(Chiranjeevi)..వంటి వారి సినిమాలకు ఫర్మనెంట్ స్టంట్ మాస్టర్. దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరితో వర్క్ చేశారు కనల్ కన్నన్ మాస్టర్. అయితే ఈ ఫేమస్ ఫైట్ మాస్టర్ ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏమింటంటే.

కనల్ కన్నన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు. ఒక మహిళతో ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతనిపై ఫిర్యాదు రావడం, కేసు నమోదు చేయడం జరిగిపోయాయి.

కనల్ కన్నన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా జూన్ 18న ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా వారి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 1న కేసు నమోదు కాగా, తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. గత ఏడాది ఓ ఆలయం విషయంలో చేసిన వ్యాఖ్యలకు కూడా అప్పట్లో ఆయన అరెస్టయ్యారు.

ఒక యువతితో పాస్టర్ డాన్స్ చేస్తున్న వీడియో. అది కూడా మన దేశానికి సంబంధించింది కాదు. వేరే దేశానికి చెందింది. ఆ వీడియోని కనల్ కన్నన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా సైబర్ క్రైం దృషికి వెళ్లడంతో.. కనల్ కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.