భోళా శంకర్ రెమ్యునరేషన్ మొత్తం పవన్ కి ఇచ్చేసిన స్టంట్ మ్యాన్.. ఎందుకో తెలుసా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పాలిటిక్స్ నుంచి కాస్త గ్యాప్ లభించినా వెంటనే తాను ఫినిష్ చేయాల్సిన చిత్రాలకు డేట్స్ ఇచ్చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పాలిటిక్స్ నుంచి కాస్త గ్యాప్ లభించినా వెంటనే తాను ఫినిష్ చేయాల్సిన చిత్రాలకు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో పవన్ ఓజి, ఉస్తాద్ చిత్రాలని ముందుగా ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ కాస్ట్యూమ్స్ లోనే పార్టీ ఆఫీస్ లో మెరిశారు. అయితే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. జనసేన పార్టీకి చాలా మంది ప్రముఖులు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ స్టంట్ మ్యాన్ గా కొనసాగుతున్న బద్రి జనసేన పార్టీకి విరాళం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బద్రిని అభినందించారు. టాలీవుడ్ చిత్రాల్లో వెహికల్ స్టంట్స్ చేసే ప్రముఖ స్టంట్ మ్యాన్ బద్రినే అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వెహికల్స్ తో భయపడకుండా స్టంట్స్ చేయడం బద్రి గారికి మాత్రమే సాధ్యం అని పవన్ ప్రశంసించారు. రీసెంట్ గా బద్రి.. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రం కోసం పనిచేశారు. ఆ చిత్రంలో వెహికల్ పల్టీలు కొట్టే సన్నివేశాన్ని ఆయన చేశారు. ఈ చిత్రానికి గాను బద్రికి ఇచ్చిన రెమ్యునరేషన్ రూ 50 వేలు. ఆ రెన్యుమరేషన్ మొత్తాన్ని జనసేన పార్టీకి ఇచ్చేసినట్లు పవన్ తెలిపారు. తానూ వైజాగ్ లో నటనలు మెళుకువలు నేర్చుకునే సమయం నుంచి ఆయనతో పరిచయం ఉంది అని పవన్ తెలిపారు.
తన రెమ్యునరేషన్ మొత్తాన్ని జనసేన పార్టీకి ఇచ్చేసిన స్టంట్ మ్యాన్ బద్రిపై జనసైనికులు, పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ చూసి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పోలీస్ గెటప్ లో పవన్ సూపర్ ఫిట్ గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.