కన్నుకొట్టే స్కూల్‌కి కొత్త ప్రిన్సిపాల్ ప్రియా వారియర్ మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకూ బాగా ప్రభావమైన వీడియో ఏదైనా ఉందంటే అది ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియోనే. 'ఓరు అడార్ లవ్' సినిమాలోని కన్నుకొట్టిన వీడియో యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. గత కొంత కాలంగా ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ.. సినిమాలో తన ప్రియుడిని చూస్తూ కన్నుకొట్టడంతో పాటు చేతి తుపాకిని ఎక్కుపెట్టిన తీరు కుర్ర హృదయాలకు కొల్లగొట్టేసింది. దీంతో ఈ అమ్మడును ఫాలో అవుతూ.. డబ్ స్మాష్ చేసే వాళ్ళ సంఖ్యా కూడా బాగా పెరిగింది. ప్రియా వారియర్ లానే చూపులతో తూటాలు పేల్చేందుకు కోట్లాది మంది యువతులు ప్రియను అనుకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.


 

స్కూల్, కాలేజ్, ఆఫీస్ అక్కడా ఇక్కడా అని కాదు.. ఎక్కడ చూసినా కన్నుకొట్టే పిల్లలు ఎక్కువైపోతుండటంతో కళాశాల యాజమాన్యాలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఇంకోసారి కాలేజ్ క్యాంపస్‌లో కన్నుకొట్టారో.. ఏడాది పాటు నిషేదం విధిస్తాం అంటూ సర్క్యులర్ జారీ చేసింది తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక కాలేజ్ మేనేజ్మెంట్.

 

 

వివరాల్లోకెళ్తే.. తమిళనాడులో వీఎల్బీ జానకి అమ్మల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజ్‌ విద్యార్ధులు ప్రియా వారియర్ కన్నుకొట్టిన సీన్‌కి బాగా ప్రభావితం అయ్యి.. ఎక్కడ చూసినా అదే పనిగా కన్నుమీటుతూ ఉండటాన్ని కాలేజ్ యాజమాన్యం గుర్తించింది. దీనికి తోడు.. కావాలని ఇలా కన్నుకొడుతున్నారంటూ పలు కంప్లైంట్‌లు కూడా విద్యార్ధుల నుండి అందటంతో చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది సదరు కాలేజ్ యాజమాన్యం.

 

కాలేజ్ క్యాంపస్‌లో ఎవరైనా కన్నుకొట్టినట్లు కనిపిస్తే.. ఏడాది కాలం పాటు కాలేజ్ నుండి బహిష్కరిస్తామంటూ సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాదు క్యాంపస్ మొత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ కన్నుకొట్టే బ్యాచ్‌ని పట్టుకునే కాలేజ్‌ నుండి సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ కాలేజ్ యాజమాన్యం షురూ చేసిన సర్క్యులర్ వైరల్‌గా మారింది. అయితే ఆ సర్క్యులర్ అంతా ఫేక్ అని ఎవరో ఫోటోషాప్‌లో ఇలా చేశారనే వార్తలు కూడా లేకపోలేదు. మొత్తానికి ప్రియా వారియర్ కన్నుకొట్టి వీళ్ల కొంపముంచిందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయినా కన్నుఉంది కదా అని ఎక్కడ బడితే అక్కడ కొట్టేస్తే.. కుర్రగుండెలు కందిపోవు మరీ..