Asianet News TeluguAsianet News Telugu

మోహన్‌ బాబూ..... ఇదేం పద్దతంటూ స్టూడెంట్స్

 శ్రీ విద్యానికేతన్ విద్యార్దులు వదిలిన ఓ వీడియోతో మోహన్ బాబు ని ఇదేం పని అని నిలదీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది...
 

Students protest at Mohan babu college jsp
Author
Hyderabad, First Published Apr 28, 2021, 8:57 AM IST

సోషల్ మీడియా రోజుల్లో సెలబ్రెటీలు రోజుకో సమస్య ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం తాము తీసుకునే నిర్ణయాల్లో అజాగ్రత్తగా ఉన్నా జనం కడిగిపారేస్తున్నారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. సోషల్ మీడియాలో ఉంటే చాలు కనెక్ట్ అయ్యిపోయి సమస్యలపై తమ వాయిస్ వినిపించేస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాగ్ తీసి నిలదీస్తున్నారు. తాజాగా మోహన్ బాబుకు ఇదే సమస్య ఎదురైంది. ఆయన నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ విద్యార్దులు వదిలిన ఓ వీడియోతో మోహన్ బాబు ని ఇదేం పని అని నిలదీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది...
 
సినీ నటుడు మోహన్‌బాబు శ్రీ విద్యానికేతన్ పేరుతో చిత్తూరు జిల్లాలో ఓ ప్రముఖ విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. కరోనా నేపధ్యంలో శ్రీ విద్యానికేతన్ వార్తల్లెక్కింది.  మోహన్‌బాబుకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.. కరోనా కబళించేస్తున్నా, క్లాసులు నిర్వహిస్తున్నారనీ, పరీక్షలు రాయాలంటూ ఒత్తడి చేస్తున్నారనీ ఆరోపిస్తూ విద్యార్థులు విద్యాసంస్థ ప్రాంగణంలోనే ఆందోళనలు చేస్తున్నారు.

అలాగే తమని, తమ ఆవేదనను యాజమాన్యం అసలు అర్థం చేసుకోవడంలేదనీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కరోనాతో 150 మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారనీ, ఓ ప్రొఫెసర్ కూడా కరోనాతో చనిపోయారనీ, పరిస్థితి అర్థం చేసుకోవాలని మోనేజ్మెంట్ ని కోరితే, బౌన్సర్లను పెట్టి తమను కొట్టిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అదే సమయంలో తమ వద్ద ఫోన్లను యాజమాన్యం లాక్కుంటోందని ఆరోపిస్తూ, ఓ వీడియో విడుదల చేశారు విద్యార్థులు.
 
అంతేకాకుండా కరోనా బాధితుల్ని కూడా పరీక్షలు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారనీ, వారికి ప్రత్యేక తరగతి గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం చెబుతోందనీ, అయితే అలాంటి పరిస్థితేదీ తమకు కనిపించడంలేదని విద్యార్థులు చెప్తూండటం గమనార్హం. ఈ వ్యవహారంపై మోహన్‌బాబు స్పందించాల్సి వుంది. 
 
ఇక మోహన్ బాబు సినిమాలు విషయానికి వస్తే..ఆయన నటిస్తున్న దేశభక్తి చిత్రం ''సన్ ఆఫ్ ఇండియా''. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సినీ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ రత్న బాబు - తోటపల్లి సాయినాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ మోహన్ బాబు స్క్రీన్ ప్లే కూడా అందిస్తుండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios