Asianet News TeluguAsianet News Telugu

`ప్రేమ దేశం` వెనుక సినిమా కష్టాలు.. ఆ క్లాసిక్‌ పేరుని చెడగొట్టమంటోన్న డైరెక్టర్‌..

`ప్రేమదేశం` సినిమా సౌత్‌లో ఓ క్లాసిక్‌ మూవీలా నిలిచిపోయింది. ప్రేమ కథలో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా వస్తుంది. ఇది నయా `ప్రేమ దేశం`.

struggle behind prema desam the director said that we will not spiol that classic movie name
Author
First Published Jan 28, 2023, 7:05 PM IST

`ప్రేమదేశం` సినిమా సౌత్‌లో ఓ క్లాసిక్‌ మూవీలా నిలిచిపోయింది. ప్రేమ కథలో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో సాగే ఈ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ వెనకాల ఏఆర్‌రెహ్మాన్‌ మ్యూజికే కీలక పాత్ర పోషించింది. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా వస్తుంది. ఇది నయా `ప్రేమ దేశం`. త్రిగుణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించగా, శ్రీకాంత్‌ సిద్ధం దర్శకత్వం వహించారు. అలనాటి అందాల తార మధుబాల ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. 

అయితే ఈ `ప్రేమదేశం` వెనకాల ఎన్నో సినిమా కష్టాలున్నాయని చెబుతున్నాడు దర్శకుడు శ్రీకాంత్‌ సిద్ధం. సినిమా చేసేందుకు ఓ నిర్మాత ముందుకొచ్చాడని, కానీ ఆదిలోనే హ్యాండిచ్చారని తెలిపారు. దీంతో తామే నిర్మాతలుగా మారాల్సి వచ్చిందట. కొన్ని రోజుల తర్వాత తమ డబ్బులు కూడా అయిపోవడంతో నిర్మాతల కోసం అన్వేషణ చేయాల్సి వచ్చిందని, ఇలా డబ్బులు యాడ్‌ అయ్యే కొద్ది సినిమాని స్టెప్‌ బై స్టెప్‌ తీసుకుంటూ వచ్చామని, అయినా క్వాలిటీ, మేకింగ్‌ విషయంలో రాజీపడలేదన్నారు దర్శకుడు. కంటెంట్‌ నమ్మి తీశామని చెప్పారు. 

`ప్రేమదేశం` టైటిల్‌ అనుకున్నప్పుడు మొదట టెన్షన్‌ పడ్డారట. ఎందుకంటే కథ పరంగా ఆ సినిమాకి, మాచిత్రానికి సంబంధం లేదు. దీంతో పోలుస్తారని ఆలోచించాం. కానీ ఈ సినిమాకి ప్రేమ దేశం ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. ఈ టైటిల్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పారు. అదే సమయంలో ఆ క్లాసిక్‌ టైటిల్‌ ని చెడగొట్టమని, ఆ చిత్రం లాగే మా సినిమా కూడా కొన్నాళ్లపాటు నిలిచిపోయే చిత్రమవుతుందన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ సిద్ధం. ఈ సినిమాని సిరి క్రియేటివ్‌ వర్క్స్ బ్యానర్‌పై కొంత మంది ఇన్వెస్టర్లతో కలిసి ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. 

సినిమా గురించి చెబుతూ, `రెండు విభిన్నమైన ప్రేమ కథలను తీసుకొని చేసిన  సినిమానే "ప్రేమదేశం".మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మంచి మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన  వారితో  చేస్తే రొటీన్ గా ఉంటుందని అలాగే ప్రేక్షకులకు కొంత ఫ్రెస్ నెస్ తో పాటు  ఆ క్యారెక్టర్ లో కొంత బబ్లీ నెస్ ఉంటుందని భావించి మధుబాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. తల్లీ,కొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. త్రిగున్ , మేఘా ఆకాష్ పెయిర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వారిద్దరూ మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఎంతో సహజంగా నటించారు. `ప్రేమదేశం` అంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది యూత్. యూత్ బేస్డ్ గా చూస్తే సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా,  కాలేజీ బ్యాక్ డ్రాప్ పరంగా చాలా  కేర్ తీసుకొని చేయడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. 

నాటి “ప్రేమదేశం” సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోశాడు. మేము విడుదల చేసిన “ప్రేమదేశం” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట, తెలవారెనే స్వామి ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి .అయితే నాడు బ్లాక్ బస్టర్ అయిన "ప్రేమదేశం" టైటిల్ పెట్టాం కదా అని ఆ టైటిల్ ను వాడుకొని సినిమా తీయకుండా నేటి యూత్ కు తగ్గట్టు కథను మార్చుకొని తియ్యడం జరిగింది. అప్పటి బ్లాక్ బస్టర్ ప్రేమదేశం సినిమాకు ఎ మాత్రం తగ్గకుండా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో  ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తుంద`ని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios