రీసెంట్ గా ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో కనిపించిన  పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్  హిట్..ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా  కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగులో దూసుకుపోతోంది. తాజాగా ఆమె హిందీలో  ‘దేదే ప్యార్‌ దే’అనే సినిమా చేసింది.  అజయ్‌ దేవగన్,  టబు తదితరులు నటించిన ‘దేదే ప్యార్‌ దే’ ఈ  మే 17 న  విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది రకుల్. అందులో భాగంగా తాజాగా ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్ లో ఓ ఫొటో షేర్ చేసింది.

ఫిటెన్నెస్ ఫ్రీక్ అయిన రకుల్   ఈ ఫొటోలో ఆమె తన కాళ్లను స్ట్రెచ్ చేసింది. కానీ పూర్తిగా చేయలేకపోయింది. అయితే హీరో అజయ్ దేవగన్ కూడా ఫిట్నెస్ విషయంలో నెంబర్ వన్. ఆయనైతే పూర్తిగా స్ట్రెచ్ చేయగలిగారు. ఈ విషయాన్ని చెప్తూ ఈ ఫొటోని షేర్ చేసింది రకుల్. ఇప్పుడీ ఫొటో ఫ్యాన్స్  తెగ నచ్చేస్తోంది. ఆమెలో డెడికేషన్ కు ఇది నిదర్శనం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

ఇక రకుల్ కెరీర్ విషయానికి  వస్తే  తెలుగులో ఒకే ఒక్క సినిమా(మన్మధుడు 2) లో న‌టిస్తున్నా త‌మిళంలో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. తమిళ స్టార్ హీరోలైన  బ్రదర్స్ సూర్య‌(ఎన్జీకే), కార్తీ ర‌కుల్‌కి ఛాన్సులిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. మరో ప్రక్క శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ రెండు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న దేదే ప్యార్ దే, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న మార్జ‌వాన్ చిత్రాల్లో న‌టిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Still cannot #SplitLikeAJ 😂...but i tried!! 🤭 😂 @AjayDevgn @dedepyaarde #may17 @smackjil

A post shared by Rakul Singh (@rakulpreet) on Mar 26, 2019 at 1:30am PDT