మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలివైన బిజినెస్ మ్యాన్ అని అనేక సార్లు ప్రూవైంది. ఆయన బిజినెస్ విషయంలో తన,మన అనే భేధం చూడరు. బిజినెస్ ని బిజినెస్ గానే చూస్తారు. అందుకే ఆ స్దాయి వ్యాపార సామ్రాజ్యం సృష్టించగలిగారు. ఆయన బిజినెస్ అంచనాలు,లెక్కలు ఎలా ఉంటాయో ఈ మధ్యనే ఆయన నెట్ ప్లిక్స్ తో చేసిన డీల్ ద్వారా అర్దం చేసుకోవచ్చు. 

అల్లు అరవింద్ కు సొంత ఓటీటి ప్లాట్ ఫామ్ ఆహా ఉంది. మొదట్లో ఆహాకు పెద్దగా రెస్పాన్స్ లేదు కానీ మెల్లిమెల్లిగా మళయాళ డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని సెటిలైపోయింది. ఇప్పుడు క్రాక్, నాంది, జాంబిరెడ్డి, గాలి సంపత్ ఇలా వరసపెట్టి కొత్త సినిమాలతో కళకళ్లాడిపోతోంది. ఈ రోజు రిలీజ్ అవుతున్న చావు కబురు చల్గా సినిమా కూడా అల్లు అరవింద్ ప్రొడక్షన్ ...ఆ సినిమాని ఆహాలో రాబోతోంది. దాంతో అల్లు అరవింద్ నిర్మాతగా చేసే సినిమాలన్నీ ఇక ఆహాలోనే అనుకున్నారు.

 కానీ అరవింద్ బిజినెస్ స్కూల్ వేరు. ఆయన తాజాగా నెట్ ప్లిక్స్ తో ఓ డీల్ చేసారు. తన బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా నిమిత్తం ఆయన డీల్ చేసుకున్నారు. తన ఆహాలోనే ఆ సినిమా వేయకుండా నెట్ ప్లిక్స్ కు ఇచ్చేయటంలోనే ఆయన తెలివి ఉందంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. దాంతో నెట్ ప్లిక్స్ మంచి ఆఫర్ ఇచ్చింది. దాంతో సినిమాపై పెట్టిన ఖర్చు రికవరీ అవుతుంది. ఇది ప్రత్యక్ష్యంగా కనపడే డబ్బు. అంతేగాని ప్రొడక్షన్ ని, తన ఓటీటిని కలపకుండా దేనికి దానికి విడివిడిగా చూడటంలోనే ఆయన సక్సెస్ ఉంది. ఇంతకు ముందు అలవైకుంఠపురములో...సినిమా సైతం ఆహా కు కాకుండా అమేజాన్ ప్రేమ్ ఓటీటికు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. 

ఇక అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈ సినిమాని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రటీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం.