హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం రద్దయినట్లు ఆమె తల్లి సుమన్ మందన్నా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కారణంగానే రక్షిత్ శెట్టి సోషల్ మీడియాకి దూరమైనట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక కావాలని తన ఎంగేజ్మెంట్ కి బ్రేకప్ చెప్పిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలపై రక్షిత్ శెట్టి స్పందిస్తూ.. ''ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని అనౌన్స్ చేశాను.

కానీ కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి మళ్లీ రావాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా జరుగుతోన్న పరిణామాలు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. మీరంతా రష్మికపై విభిన్న అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. మిమ్మల్ని నేను తప్పు పట్టను ఎందుకంటే బయటకి అలా ప్రొజెక్ట్ అయింది. మనం విని, చూసే విషయాలనే నమ్ముతాం. ఒక్కోసారి మనం చూసేవి నిజం కాకపోవచ్చు.

మరోవైపు నుండి ఆలోచించకుండా నిర్ణయానికి వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండేళ్లుగా తెలుసు. మీకంటే ఆమె గురించి నాకే బాగా తెలుసు. ఆమెను జడ్జ్ చేయకండి.. ప్రశాంతంగా ఉండనివ్వండి. త్వరలో అన్ని నిజాలు బయటకి వచ్చి అంతా సర్దుకుంటుందని ఆశిస్తున్నాను. మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దు. అవసరాల కోసం ఎవరికి వారు వార్తలు సృష్టిస్తున్నారు. ఊహాగానాలు నిజం కావు.

ఈ మెసేజ్ అందరికీ చేరువ కావాలని నేను ఫేస్ బుక్ పేజీని తెరిచే ఉంచుతాను. ఆ తరువాత సోషల్ మీడియా అవసరం నాకుందని అనుకున్నప్పుడు మళ్లీ వస్తాను. నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి, రష్మికకు ఎలాంటి సంబంధం లేదు'' అంటూ వెల్లడించారు.  

సంబంధిత వార్తలు.. 

హీరో షాకింగ్ డెసిషన్.. కారణం ఆమేనా..?

నిశ్చితార్ధం రద్దయింది.. హీరోయిన్ తల్లి కన్ఫర్మేషన్!