ఈ వారం కూడా భగవంత్ కేసరిదే... బాలయ్య హిట్ కొట్టేనా?
దసరా విన్నర్ గా చెప్పుకుంటున్న భగవంత్ కేసరి ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ వారం మేజర్ రిలీజ్లు లేని పక్షంలో బాలకృష్ణ టార్గెట్ చేరుకుంటాడా లేదా అనే ఆసక్తి నెలకొంది.
ముగ్గురు బడా హీరోలు దసరా బరిలో నిలిచారు. అక్టోబర్ 19న బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో విడుదలయ్యాయి. లియో నెగిటివ్ టాక్ తెచ్చుకోగా... భగవంత్ కేసరి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. 20న విడుదలైన టైగర్ నాగేశ్వరరావు సైతం నిరాశపరిచింది. ఈ మూడు చిత్రాల్లో భగవంత్ కేసరి బెటర్ టాక్ తెచ్చుకుంది. టాక్ తో సంబంధం లేకుండా లియో తెలుగులో లాభాలు పంచింది. రూ. 16 కోట్లకు తెలుగు రాష్ట్రాల హక్కులను కొంటే... రూ. 20 షేర్, 35 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
కాబట్టి లియో తెలుగులో క్లీన్ హిట్ గా నిలిచింది. పండగ సెలవులు కావడంతో భగవంత్ కేసరి, టైగర్ నాగేస్వరరావు వసూళ్లు కూడా నిలకడగా సాగాయి. ఐదు రోజుల వరకూ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు సత్తా చాటాయి. కాగా భగవంత్ కేసరి 10 రోజులకు దాదాపు రూ. 60 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టినట్లు రిపోర్ట్ చేశాయి. అంటే ఈ చిత్రం చేరుకోవాల్సిన టార్గెట్ ఇంకా ఉంది. వరల్డ్ వైడ్ రూ. 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నేపథ్యంలో రూ. 68 కోట్ల షేర్ రాబడితే కానీ మూవీ హిట్ కాదు.
అంటే మరో రూ. 8 కోట్లు వస్తే కానీ భగవంత్ కేసరి హిట్. అయితే ఈ వారం కూడా భగవంత్ కేసరిదే. ఒక్క మేజర్ మూవీ కూడా శుక్రవారం విడుదల కాలేదు. చిన్న సినిమాలు విడుదలైనా వాటి గురించి జనాలకు తెలియదు. కాబట్టి భగవంత్ కేసరి నిలకడగా రాణిస్తే ఈ టార్గెట్ పెద్దదేమీ కాదు. మరి చూడాలి బాలయ్య ఈ అనుకూల పరిణామాన్ని వాడుకుంటారో లేదో. టైగర్ నాగేశ్వరరావు రూ. 15 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చే సూచనలు కలవు...
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. షైన్ స్క్రీన్ పతాకం పై రూపొందించారు. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించారు.