Asianet News TeluguAsianet News Telugu

'మార్క్ ఆంటోనీ' పై కోర్టు బ్యాన్ ఏమైంది..15 రిలీజ్ ఉందా?

  వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో కోర్ట్ కేసు పడింది. విడుదల దగ్గర పడుతున్న సమయంలో ...

Stay vacated Vishal Mark Antony to release on the decided date, Spetember 15 jsp
Author
First Published Sep 13, 2023, 11:07 AM IST


 హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. ట్రైమ్ ట్రావెల్ నేపధ్యంలో  లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ తో ప్రాజెక్టు పై బజ్ క్రియేట్ అయ్యింది. విశాల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, సునీల్, అభినయ కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో కోర్ట్ కేసు పడింది. విడుదల దగ్గర పడుతున్న సమయంలో విశాల్, లైకా నిర్మాణ సంస్థ మధ్య ఏర్పడిన వివాదం తెరపైకి వచ్చింది. 
 
గతంలో హీరో  విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ.. గోపురం ఫిల్మ్స్ రూ.21.29 కోట్ల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆ అమౌంట్ ను విశాల్ తిరిగి చెల్లించకపోవడంతో.. విశాల్‌ను నమ్మి ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్‌ చెల్లించింది. ఈ విషయంలో విశాల్, లైకా మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే.. విశాల్ ఆ అమౌంట్ తిరిగి చెల్లించేవరకు ఆయన సొంత సంస్థ నుండి వచ్చే అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇవ్వాలని ఒప్పందం రాసుకున్నారు.   కానీ విశాల్ హీరోగా వచ్చిన సామాన్యుడు సినిమాను లేకాకు ఇవ్వలేదు. దీంతో ఆ సినిమాపై నిషేధం విధించాలని మద్రాసు హైకోర్టులో కేసు వేసింది లైకా సంస్థ. 

దీంతో..  హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్‌ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది. ఆ రూ.15 కోట్లు కూడా డిపాజిట్ కాకపోవడంతో ఆ కేసు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా వద్దకు విచారణకు వచ్చింది. ఈ మేరకు విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కోర్టు. అంతేకాకుండా విశాల్ సెప్టెంబరు 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు విశాల్ స్వయంగా కోర్టుకు హాజరై ప్రాబ్లమ్ ను క్లియర్ చేశారు. దీంతో మార్క్ ఆంటోని రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు.  

తమ సినిమాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హీరో విశాల్ కూడా ట్వీట్ చేశాడు. “మార్క్ ఆంటోనీ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కోర్టు అభ్యంతరం లేదని తెలిపింది. స్టేను తొలగించింది. మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హిందీలో 22న విడుదలవుతుంది” అని విశాల్ ట్వీట్ చేశాడు. సెప్టెంబర్ 15వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. హిందీ వెర్షన్ 22న రిలీజ్ కానుంది.

మార్క్ ఆంటోనీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 15న విడుదల కానుండడంతో మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios