స్టార్లు.. బ్రేకప్ కహానీలు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 6:07 PM IST
stars and their break up stories
Highlights

సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు అనేవి సర్వసాధారణం. తనకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయడం, నచ్చలేదనుకున్నప్పుడు విడిపోవడం చేస్తుంటారు మన స్టార్లు. సౌత్ ఇండస్ట్రీలలో కంటే నార్త్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది

సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు అనేవి సర్వసాధారణం. తనకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయడం, నచ్చలేదనుకున్నప్పుడు విడిపోవడం చేస్తుంటారు మన స్టార్లు. సౌత్ ఇండస్ట్రీలలో కంటే నార్త్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తమ ప్రేమని ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్లి పెళ్లి బ్రేకప్ చేసిన జంటలు కూడా ఉన్నాయి. వాళ్లలో మన సౌత్ తారలు కూడా బాగానే ఉన్నారు.

ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే.. నయనతార గురించే చెప్పాలి. మొదట శింబుని ప్రేమించిన ఆమె ఆ తరువాత అతడి నుండి విడిపోయి ప్రభుదేవాతో రిలేషన్షిప్ మైంటైన్ చేసింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన విడిపోయారు. ప్రస్తుతం నయనతార దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తో ప్రేమలో ఉంది. అతడు తనకు కాబోయే భర్త అంటూ ఓ సందర్భంలో వెల్లడించింది. 

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొంతకాలం పాటు వరుణ్ మానియన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించిన త్రిష తమ ప్రేమని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా ఈ జంట ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నారు. వరుణ్ కి త్రిష పెళ్లి తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయడం ఇష్టం లేకపోవడంతో అదే విషయాన్ని ఆమెకి చెప్పినట్లు, దీంతో ఆమె అతడికి గుడ్ బై చెప్పినట్లు టాక్. 

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ తెలుగులో మొదటి సినిమా రిలీజ్ అయిన తరువాత పెళ్లికి రెడీ అయిపోయాడు. 2015లో తను ప్రేమించిన శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొద్దిరోజులకే ఈ జంట విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అఖిల్ ఈగో ఇష్యూల కారణంగా వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించేది. రీసెంట్ గా శ్రియా భూపాల్ అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. అఖిల్ మాత్రం సినిమాలతో బిజీగా మారిపోయాడు. 

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తోన్న మరో బ్రేకప్ స్టోరీ రష్మికది. తను ప్రేమించిన రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం చేసుకున్న రష్మిక ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలని చూస్తుందట. అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన లేనప్పటికీ రష్మిక సన్నిహితులే ఈ విషయాన్ని బయట పెట్టారని ప్రచారం జరుగుతోంది.  

loader