ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత ఎంఎస్ రాజు బ్యానర్ విలువ ఇప్పుడు బాగా పడిపోయింది. వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డాడు. మధ్యలో డైరెక్టర్ గా ఆయన తీసిన సినిమాలు కూడా బాగా దెబ్బ కొట్టాయి.

ఆ తరువాత మళ్లీ నిర్మాతగా ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తే... అది అతడికి మరిన్ని నష్టాలను తీసుకొచ్చింది. ఇక నిర్మాతగా సినిమాలు చేయడం మానేసి హీరోగా తన కొడుకుని నిలబెట్టాలని ఈ నిర్మాత ఎన్ని చాలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది.

సుమంత్ అశ్విన్ హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటివరకు సరైన హిట్టు మాత్రం పడలేదు. కొన్ని సినిమాలు ఏవరేజ్ అనిపించుకున్నా.. అతడికి అవకాశాలు మాత్రం  తీసుకురాలేకపోయాయి.

దీంతో తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని తన కాంటాక్ట్స్ ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎంఎస్ రాజు. తాజాగా 'దండుపాల్యం' ఫేం దర్శకుడు శ్రీనివాస్ రాజుతో సినిమా సెట్ చేశాడు. గరుడ వేగ వంటి సినిమాను నిర్మించిన నిర్మాతలను ఈ సినిమా కోసం రంగంలోకి దించాడు ఎంఎస్ రాజు. ఈ సినిమాతో తన కొడుకుకి మంచి సక్సెస్ రావాలనేది అతడి తపన. మరి ఈసారైనా అతడి కోరిక నెరవేరుతుందేమో చూడాలి!