తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో నిర్వహించనున్న స్టార్ మా స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ హౌజ్ సెలెబ్రిటీ లిస్ట్ లో పోసాని, మంచులక్ష్మి అందాల హీరోయిన్లు స్నేహ, రంభ, సదాలు కూడా పార్టిసిపెంట్స్ అందమైన ముద్దుగుమ్మలతో తెలుగు బిగ్ బాస్ షోకు యమా క్రేజ్ 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ చేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందీ వెర్షన్‌లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం దక్షిణాదికి విస్తరిస్తున్నారు. తమిళంలో హోస్ట్‌గా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తుండగా, తెలుగులో ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లను తాజాగా స్టార్ మా టెలివిజన్ చానెల్ వెల్లడించింది.

బిగ్‌బాస్‌లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా. దక్షిణాదిలో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కుదుర్చుకొన్న నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం.

తెలుగు చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా రాణించిన స్నేహ కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనున్నారు. ఆమె నటించిన చిత్రాలు దక్షిణాదిలో చాలా సక్సెస్‌గా నిలిచాయి. పలు భాషల్లో అగ్రహీరోల సరసన ఆమె నటించిన ఘనత ఉంది. స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

బిగ్‌బాస్‌లో పాల్గొనే అగ్రతారల్లో రంభ ఒకరు కావడం మరో విశేషం. యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకమైన పాటలో కూడా నర్తించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రంభ ఒకరు. రంభ గ్లామర్ బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

టాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న యాక్టర్లలో మంచు లక్ష్మి ఒకరు. సినీ నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మంచు లక్ష్మీతోపాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశం కనిపిస్తున్నది.

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో జూలై 15వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. దాదాపు 70 రోజులు పెద్ద భవనంలో కలిసి ఉంటారు. ఈ భవనం చుట్టూ 70 కెమెరాలు అమర్చారు.