టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన మిల్కీబ్యూటీ తమన్నా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కోలివుడ్, బాలీవుడ్ లలో కూడా పని చేసిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. గత కొంతకాలంగా ఈ బ్యూటీ తన సహనటుడితో ప్రేమాయణం సాగిస్తోందని వార్తలు వినిపించాయి.

అతడికి ఇదివరకే పెళ్లై విడాకులు కూడా జరిగాయి. అయితే తను ఎవరితో రిలేషన్ లో లేనని తమన్నా వెల్లడించింది. ఆ తరువాత ముంబైకి చెందిన ఓ వ్యాపారితో తమన్నా ప్రేమలో ఉందని మీడియాలో వార్తలు వినిపించాయి. వాటిని కూడా ఖండించింది ఈ బ్యూటీ. తనపై ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతీసారి తమన్నా క్లారిటీ ఇస్తూనే ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తనకోసం తన తల్లి పెళ్లి సంబంధాలు చూస్తోందని.. పెళ్లి విషయం పూర్తిగా తల్లితండ్రుల నిర్ణయానికే వదిలేశానని చెప్పింది. తను ఎవరితోనూ రిలేషన్ లో లేనని మరోసారి చెప్పింది.

తనకి పెళ్లి కుదిరితే మీడియా వారికి, అభిమానులకు స్వయంగా చెబుతానని వెల్లడించింది. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.