టాలీవుడ్ లో అసలు కాస్టింగ్ కౌచ్ లేదని హీరోయిన్లను సెక్సువల్ ఫేవర్స్ గురించి అడగరని అంటోంది స్టార్ హీరోయిన్ తమన్నా. ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఉందని, సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తమను లైంగికంగా హింసించారని కామెంట్స్ చేశారు.

కొందరు ఆధారాలతో సహా దర్శకనిర్మాతల వ్యవహారాలు బయటపెట్టారు. ఈ విషయాన్ని కొందరు స్టార్ హీరోయిన్లు కూడా అంగీకరించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ తాము మాత్రం బాధితులు కామని అన్నారు. కొందరు హీరోలు కూడా ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఉందన్నట్లుగా స్పందించి, దీన్ని అరికడతామని అన్నారు. 

నిందితులుగా నిలిచిన దర్శకులతో పని చేయమని బాలీవుడ్ లో కొందరు హీరోలు కూడా ప్రకటించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇంత వేడెక్కుతుంటే అసలు అలాంటివేం జరగడం లేదంటూ తమన్నా చెప్పడం అందరికీ షాక్ ఇస్తోంది. ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా ఉన్న హీరోయిన్ తమన్నా.

అలాంటిది ఆమె కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. హీరోయిన్లను ఎవరూ సెక్సువల్ ఫేవర్స్ గురించి అడగరని.. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలను రూపొందిస్తారని, అలాంటిది సినిమా పరిశ్రమలో హీరోయిన్లను వేధించేందుకు ఎవరికీ తీరిక ఉండదన్నట్లు తమన్నా వెల్లడించింది. మరి దీనిపై లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని చెబుతోన్న హీరోయిన్లు ఎలా స్పందిస్తారో చూడాలి!