ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోన్న కొత్త సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఈమెతో పాటు మరో ఓ కొత్త అమ్మాయి కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెతో ఈ స్టార్ హీరోయిన్ కి వచ్చిన సమస్యేంటో తెలియదు కానీ.. సినిమా ప్రమోషన్స్ కి ఆమెని దూరంగా ఉంచుతుందట.

సినిమా పబ్లిసిటీ టీమ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్టార్ హీరోయిన్ నిర్మాతలకు ఒక కండీషన్ పెట్టిందట. కొత్త అమ్మాయిని ప్రమోషన్స్ కి తీసుకువస్తే తను రానని నిర్మొహమాటంగా చెప్పేసిందట.

స్టార్ హీరోయిన్ పైగా యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్.. ఆమె లేకుండా సినిమాను ప్రమోట్ చేయలేమని భావించిన టీం ఆమె షరతులకు అంగీకరించి కొత్త అమ్మాయిని  పక్కన పెట్టేసినట్లు సమాచారం.

గతంలో కూడా ఈ స్టార్ హీరోయిన్ ఈవిధంగా ప్రవర్తించిందని చెబుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ కారణంగానే నిర్మాతలు ఆమె చెప్పినట్లుగానే వింటున్నారు.