రామ్‌చరణ్ సరసన స్టార్ హీరోయిన్ కూతురు.. మరో బ్యూటీని పరిచయం చేయబోతున్న బుచ్చిబాబు?
`ఆర్‌సీ16`గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభమైంది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. తాజాగా హీరోయిన్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan).. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` (game Changer) చిత్రంలో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన ఓ చిత్రానికి రెడీ అయ్యారు.
`ఆర్‌సీ16`(Rc16)గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభమైంది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. త్వరలోనే ఈ సినిమాని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు. అందులో భాగంగా రామ్‌చరణ్ సరసన హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతుంది. చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
రామ్‌చరణ్, బుచ్చిబాబు చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ కూతురు హీరోయిన్‌గా నటించబోతుందట. ఒకప్పుడు హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన రవీనా టండన్(Raveena Tandon) గురించి తెలిసిందే. ఆమె ఇటీవల `కేజీఎఫ్2`లో ప్రధాని పాత్రలో నటించి మెప్పించింది. ఆమె కూతురుని హీరోయిన్‌గా పరిచయం చేయబోతుందట. తన కూతురు రాషా థడానీని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె ఓ హిందీ సినిమాకి కమిట్ అయినట్టు సమాచారం.
దీంతోపాటు తెలుగులోకి కూడా ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారట. రామ్‌చరణ్ చిత్రంలో హీరోయిన్‌గా అయితే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో ఈ బ్యూటీపై ఫోటో షూట్ కూడా చేశారు. ఈ మేరకు ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. మరి రామ్‌చరణ్ సరసన మరీ చిన్నదైపోతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ ఈ బ్యూటీ ఆల్మోస్ట్ ఫైనల్ అనే టాక్ వినిపిస్తుంది.
బుచ్చిబాబు మొదట `ఉప్పెన` చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్‌ని, కృతి శెట్టిని పరిచయం చేస్తూ తాను పరిచయం అయ్యాడు. ఇక రామ్‌చరణ్ సినిమా విషయానికి వస్తే ఇది స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమని తెలుస్తుంది. దీనికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.