తెలుగులో ఓ వెలుగు వెలిగి..ప్రస్తుతం ఆరిన ఓ హీరోయిన్ ఇక్కడ పని అయ్యేటట్లు లేదని తమిళం వైపు చూస్తోంది. అందులో వింతముంది అంటారా..అక్కడ ఆఫర్స్ కోసం ఓ తమిళ స్టార్ హీరోని పట్టిందంటున్నారు.vసదరు హీరోతో ఆమె డేటింగ్ లు, షాపింగ్ లు అంటూ తిరుగుతోందిట. ఎక్కువ చెన్నైలోనే కనపడుతోందిట. ఏంటంటే ఇక్కడ షూటింగ్ కోసం వచ్చాను అని చెప్తోంది. సదరు హీరో గారికి ఆల్రెడీ పెళ్లైందిట. అయితే ఆమెకు చెన్నైలో పరిచయాలు తక్కువ...తమిళం పెద్దగా రాదు కాబట్టి తన సహకారం తీసుకుంటోందని కవర్ చేసే పనిలో బిజిగా ఉన్నారట. 

గత రెండు నెలలగా ఈ డేటింగ్ వ్యవహారం జరుగుతోందని చెప్తున్నారు. ఈ రెండు నెలలో ఆమె వరస పెట్టి ప్రాజెక్టులు సైన్ చేస్తోందిట. ఆమె ను తీసుకోమని తన దర్శక,నిర్మాతలైన స్నేహితులకు రికమెండ్ చేస్తున్నాడట. అయితే ఆమె కూడా నటన, అందంలో స్ట్రాంగే కాబట్టి ఎవరూ నో చెప్పటం లేదట. ఆమెను తీసుకుంటే తెలుగు మార్కెట్ కూడా బెంగ ఉండదని నమ్ముతున్నారట. 

దాంతో ఆమె ఇక్కడ తెలుగు సినిమాలు కూడా నో చెప్పేస్తోందిట. అక్కడ వరసగా ఓ పది సినిమాల్లో అయినా కనిపించాలనే తాపత్రయంలో ఉందిట. అలా వరసగా రెండేళ్ల పాటు కనపడితే ప్రేక్షకులుకు అలవాటు పడిపోతామని ఆమె ఆలోచనగా చెప్తున్నారు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఆమె సైన్ చేసిందంటున్నారు. తెలుగులో ఆమె చివరగా చేసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో దృష్టి అక్కడే పెట్టింది. ఎవరి స్కెచ్ లు వాళ్లవి.