టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ నెక్స్ట్ కోలీవుడ్ కథతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. జిగర్తాండా అనే మూవీని రీమేక్ చేయాలనీ గత కొంత కాలంగా కుర్ర హీరోలతో చర్చలు జరుపుతున్న హరీష్ రీసెంట్ గా వరుణ్ ని అలాగే నాగ శౌర్యను ఒప్పించాడు. అయితే ఈ ప్రాజెక్టును ఇదివరకే ఇతరులకు చెప్పి యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సమయంలో రవితేజకు కథను చెప్పిన హరీష్ ఆ సినిమా రిలీజ్ అనంతరం మళ్ళి మాస్ రాజను కలవలేదు. ఇక సాయి ధరమ్ తేజ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు కథను వినిపించగా ఆ తరువాత హరీష్ మరొకరిని ఫిక్స్ చేసుకున్నాడు. రవితేజ - సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా జిగర్తాండ రీమేక్ లో తప్పకుండా నటిస్తామని చెప్పారు. 

కాకపోతే కొంచెం టైమ్ కావాలని ఇద్దరు కోరారు. కానీ హరీష్ ఇద్దరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుణ్ - నాగ శౌర్యలను ఫిక్స్ చేసుకోవడంతో ఇద్దరు హీరోలు హార్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే హరీష్ మాత్రం కాల్షీట్స్ లో కన్ఫ్యూజన్ గా ఉండకూడదనే కొత్త హీరోలను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ముందుగా హరీష్ వారితో ఓ మాట చెప్పి ఉంటె బావుండేది.