Asianet News TeluguAsianet News Telugu

విజయ్ తో నాకు మాటల్లేవు... స్టార్ హీరో తండ్రి కీలక వ్యాఖ్యలు!


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తండ్రి చంద్రశేఖర్ కి విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రశేఖర్ లేటెస్ట్ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. 
 

star hero vijay father opens on differences with son
Author
First Published Jan 28, 2023, 12:41 PM IST


కొడుకు విజయ్ తో విబేధాలున్నాయని చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఏడాదిన్నర కాలంగా ఇద్దరి మధ్య మాటల్లేవని ఆయన స్పష్టత ఇచ్చారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ... విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమా తర్వాత విజయ్ నా సెకండ్ ప్రయారిటీ. భార్య కూడా విజయ్ తర్వాతే. అయితే మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. కొన్ని విషయాల కారణంగా దూరం ఏర్పడింది. అయితే అదేమీ పెద్ద విషయం కాదు. తండ్రి కొడుకుల మధ్య విబేధాలు సాధారణంగానే ఏర్పడతాయి. 

అంత మాత్రాన ఇది చర్చించాల్సిన విషయం కాదు. విడిపోవడం కలవడం జరుగుతూనే ఉంటాయి. ఇటీవల అందరం కలిసి వారిసు చిత్రం చూశాము, అని వెల్లడించారు. విజయ్ తో మాటల్లేవ్ అంటూనే అతి పెద్ద విషయం కాదు. మాట్లాడుకోకపోయినా ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటుందని ఆయన పరోక్షంగా తెలియజేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలని చంద్రశేఖర్ పట్టుబడుతున్నారు. విజయ్ కి ఇష్టం లేకుండానే ఆయన పేరున పొలిటికల్ ఈవెంట్స్ నిర్వహించారు. 

ఇది నచ్చని విజయ్ తండ్రిని మందలించడం జరిగింది. ఈ విషయంలో సీరియస్ గొడవలు చోటు చేసుకున్నాయి. తన నాన్న నిర్వహించే పొలిటికల్ ఈవెంట్స్ తో తనకు సంబంధం లేదని విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పలుమార్లు చెప్పినా వినకపోవడంతో విజయ్ సొంత తండ్రిపై ఫిర్యాదు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. 

చంద్రశేఖర్ సీనియర్ డైరెక్టర్. ఆయన రైటర్, నిర్మాత, యాక్టర్ కూడాను. తన వారసుడిగా విజయ్ ని సినిమాల్లోకి తెచ్చాడు. విజయ్ కోలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్ బేస్ రజినీకాంత్ ని కూడా మించిపోయింది. విజయ్ లేటెస్ట్ మూవీ వారసుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ మూవీ అంటే రెండు వందల కోట్లు అవలీలగా వచ్చేస్తున్నాయి. ఆయన రేంజ్ అలా ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios