స్టార్ హీరో కొడుకు యాక్సిడెంట్.. ఒకరికి సీరియస్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Aug 2018, 10:18 AM IST
star hero's son involved in car accident
Highlights

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ తన కారుతో యాక్సిడెంట్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ తన కారుతో యాక్సిడెంట్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో ఈ సంఘటన చోటు 
చేసుకుంది. రోడ్ పక్కన పార్క్ చేసి ఉన్న మూడు ఆటోల మీదుగా దృవ్ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కాలు ఫ్రాక్చర్ కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

ఈ విషయంపై పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దృవ్ ని హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు విక్రమ్. 'అర్జున్ రెడ్డి' సినిమా తమిళ రీమేక్ 'వర్మ'తో దృవ్ కోలీవుడ్ లో పరిచయం కానున్నాడు. అలానే శేఖర్ కమ్ముల కూడా దృవ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో దృవ్ చేసిన కార్ యాక్సిడెంట్ అతడిని ఎలాంటి ఇబ్బందుల్లో నెట్టేస్తుందో చూడాలి!

loader