మహేష్, సుకుమార్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే..?

First Published 18, Aug 2018, 1:06 PM IST
Star Hero Playing Key Role in Mahesh babu And Sukumar Film
Highlights

 తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల నిడివి గల అతిథి పాత్ర ఒకటి ఉందట. దానికోసం ప్రభాస్ ని సంప్రదించగా ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా గెస్ట్ రోల్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది.

'రంగస్థలం' సినిమాతో సుకుమార్ స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తరువాత కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న సుకుమార్ తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'వన్ నేనొక్కడినే' సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో మహేష్ కి ఓ హిట్ ఇవ్వాలని సుకుమార్ అనుకుంటున్నాడు.

ఈ క్రమంలో మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ కాంబినేషన్ లో సినిమా మొదలుకానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల నిడివి గల అతిథి పాత్ర ఒకటి ఉందట. దానికోసం ప్రభాస్ ని సంప్రదించగా ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా గెస్ట్ రోల్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ఆ పాత్రను రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ లతో చేయించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి హీరోలతో సుకుమార్ కి మంచి సాన్నిహిత్యం ఉండడం, పైగా మహేష్ కి చరణ్, ఎన్టీఆర్ లు స్నేహితులు కావడంతో వీరిద్దరిలో ఒకరు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి మహేష్ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

loader