ఒక్కప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండేవాడు అజిత్‌. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఆయనకు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు ఉండేది. అజిత్ నటించిన ప్రేమ లేఖ అప్పట్లో సంచలన విజయం సాధించింది. తెలుగు మరియు తమిళ భాషలలో ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఐతే అజిత్ లైఫ్ లో రియల్ లవ్ స్టోరీ కూడా ఉంది. 

 90లలో హీరోయిన్  హీరా రాజ్‌గోపాల్‌ ను అజిత్‌ ఘాడంగా ప్రేమించారు. ఆ రోజుల్లో వీరి ఎఫైర్ టాక్‌ ఆప్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ రోజుల్లో హీరాకు అజిత్‌ లవ్ లెటర్స్ కూడా రాశారట. మరుగున పడిన ఈ లవ్ స్టోరీని యాక్టర్ బాయిల్వాన్‌ రంగనాథన్‌ బయటపెట్టారు. అజిత్ హీరాకు రాసిన లెటర్స్‌లో ఒక లెటర్  తాను చదివానని పేర్కొనడంతో వీరి లవ్‌స్టోరి మరోసారి వార్తల్లో నిలిచింది.కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్‌ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు.

అజిత్, హీరా పెళ్లి కాకపోవడానికి హీరా తల్లి కారణమట. వీరి వివాహానికి హీరా తల్లి ఒప్పుకోలేదట.  అలా అజిత్, హీరా లవ్‌ స్టోరికి ఫుల్‌స్టాప్‌ పడినట్లు కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.ఆ తరువాత  అజిత్‌ మరో హీరోయిన్ షాలినిని ప్రేమ వివాహం  చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అజిత్ ప్రస్తుతం వాలిమై మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.