కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్.మురగదాస్ షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా మొదలైంది అంటే ఏ మ్యాటర్ కూడా బయటకు లీక్ కాకూడదని చూసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలోని జూనియర్ ఆర్టిస్ట్ లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్.మురగదాస్ షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా మొదలైంది అంటే ఏ మ్యాటర్ కూడా బయటకు లీక్ కాకూడదని చూసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలోని జూనియర్ ఆర్టిస్ట్ లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడమని చెప్పారు. 

ప్రియమైన సర్కార్ కాస్ట్ - క్రూ చాలామంది ఈ చిత్ర నిర్మాణం కోసం కృషి చేశారు. అయినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ లు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇది అనైతికమైనది. భవిష్యత్తులో మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ మురగదాస్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిక జారీ చేశారు. 

విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న సర్కార్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు జనాల్లో నానుతుండడంతో సర్కార్ దర్శకుడు మురగదాస్ కొంచెం సీరియస్ అయ్యారు. సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ లు ఇస్తున్న ఇంటర్వ్యూల వలన సినిమాకు సంబందించిన విషయాలు బయటపడుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు