ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. భాషతో సబంధం లేకుండా సినిమా వాళ్లు చాలా మంది వరుసగా కన్నుమూస్తు వస్తున్నారు. ఈక్రమంలో రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ శిష్యుడు, నటుడు శరణ్‌ రాజ్‌ కన్నుమూశారు. 26 ఏళ్ళ అతి చిన్న వయస్సులో.. బైకు యాక్సిడెంట్‌ కారణంగా శరణ్‌ తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఇది మరో నటుడి కారణంగా జరిగినట్టు తెలుస్తోంది. మరో నటుడి కారణంగా శరణ్‌ రాజ్‌ ప్రమాదానికి గురై చనిపోవటం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచేసింది. 

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. శరణ్‌ రాజ్‌ చెన్నైలోని మధురవోయల్‌లోని ధనలక్ష్మి పేటలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తన బైకుపై కేకే నగర్‌లోని రోడ్డుపై వెళుతూ ఉన్నారు.సరిగ్గా అదే సమంయంలో ఓ కారు.. శరణ్‌ రాజ్‌ వెళుతున్న బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శరణ్‌ అక్కడికక్కడే మరణించారు. అయితే ఇక్కడే ఓ సంచలన నిజం బయటకు వచ్చింది. ఈ యాక్సిడెంట్.. ఫిల్మ్ ఇండస్ట్రీ లోని వక్యాక్తుల వల్లే జరిగినట్టు తేలింది.

శరణ్ మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శరణ్‌ రాజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్న పళనప్పన్‌ అనే వ్యక్తి కారణంగానే ఈ యాక్సిడెంట్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

పళనప్పన్‌ మద్యం సేవించి కారు నడిపాడని, ఆ మత్తులోనే శరణ్‌ బైకును ఢీకొట్టాడని తేలింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకీ తీసుకున్నారు. కాగా, శరణ్‌ రాజ్‌ గత కొన్నేళ్లుగా వెట్రిమారన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అంతే కాదు యాక్టింగ్ అంటే ఇష్టంతో.. వెట్రిమారన్‌ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారు. అసురన్‌, వడాచెన్నై లాంటి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేస్తూనే.. అందులో నటించారు. చాలా చిన్నవయస్సులో.. ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యాక్తి ఇలా మరణించడం.. ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.