Asianet News TeluguAsianet News Telugu

నేను చిరంజీవి ఎదుగుదలకి ఉపయోగపడ్డా, ఆయన నాకు బంధువే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సంబరాలు మొదలయ్యాయి. ఇంద్ర 4 కె వెర్షన్ తో రీ రిలీజ్ అవుతోంది. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత హంగామా చేస్తున్నారు.

Star director sensational comments on megastar chiranjeevi dtr
Author
First Published Aug 21, 2024, 10:15 PM IST | Last Updated Aug 21, 2024, 10:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సంబరాలు మొదలయ్యాయి. ఇంద్ర 4 కె వెర్షన్ తో రీ రిలీజ్ అవుతోంది. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత హంగామా చేస్తున్నారు. ఆగష్టు 22 గురువారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. దాసరి, చిరంజీవి మధ్య విభేదాలు ఉన్నట్లు అప్పట్లో పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. 

ముఖ్యంగా పాలిటిక్స్ లో చిరు, దాసరి మధ్య వైరం ఎక్కువగా ఉండేదని టాక్. దీనిపై దాసరి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. చిరంజీవి ఎదుగుదలకి నేను పరోక్షంగా ఎలా ఉపయోగ పడ్డానో అతనికి అతని ఫ్యామిలీకి బాగా తెలుసు. చిరంజీవి నాకు బంధువు కూడా. చిరంజీవి పిన్నమ్మని మా కుటుంబంలోని వ్యక్తికే ఇచ్చారు. చిరంజీవితో నాకెందుకు విభేదాలు ఉంటాయి. 

కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు, నా సినిమాల్లో వచ్చిన పాత్రలని చిరంజీవికి వ్యతిరేకంగా అనుకుని చాలా మంది పొరపాటు పడ్డారు. చిరంజీవిని నేనెందుకు తగ్గిస్తాను. చాలా వేదికలపై నంబర్ 1 నుంచి నంబర్ 10 వరకు అన్నీ స్థానాలు చిరంజీవివే అని ప్రశంసించింది తానే అన్నట్లు దాసరి నారాయణ రావు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios