Asianet News TeluguAsianet News Telugu

విజయ్ పై పూరీ పొగడ్తలు.. నన్ను తండ్రిలా చూసుకున్నాడంటూ స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ క్రేజీ కాంబినేషనల్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పూరీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
 

Star Director Puri Jagannadh Emotional Comments on Vijay Deverakonda
Author
Hyderabad, First Published Aug 15, 2022, 1:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఇటు ప్రేక్షకులు, అటు సినీ దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటికే కరోనా పరిస్థితుల్లో తనవంతుగా పేదలకు సాయం చేసిన విజయ్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు తన నటిస్తున్న చిత్రాలకు సంబంధించి నిర్మాతలు, దర్శకులను తన హ్యుమానిటీతో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ నటించిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’ (Liger). ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని చాలా క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఇండియా మొత్తం చుట్టి వచ్చిన  లైగర్ టీం.. నిన్న వరంగల్ ఆడియెన్స్ తో మీట్ అయ్యింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ విజయ్ గురించి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘విజయ్ లో ఇంత పొగరు కూడా లేదు. చాలా నిజాయితీగా నటించాడు. విజయ్ సినిమాలో కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప నటుడే. సినిమా ప్రారంభానికి ముందు వాళ్ల నాన్నతో మాట్లాడాను. విజయ్ ను కొడుకులా చూసుకో.. మంచి సినిమా తీయమని చెప్పాడు. కానీ నన్నే విజయ్ తండ్రిలా చూసుకున్నాడు. మా సినిమా కష్టాల్లోనూ పాలు పంచుకున్నాడు. తన ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో అప్పుడప్పుడు రూ. కోటీ.. రూ. 2 రెండు కోట్లు పంపించాం. విజయ్ మాత్రం ఆ డబ్బులను కూడా మా ఆర్థిక సమస్యలను తీర్చేందుకు తిరిగి  పంపించి గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఇంతకంటే మంచి యాక్టర్ దొరకడం కష్టం. నేనెప్పుడు విజయ్ లా మరొకరిని చూడలేదు.’ అంటూ విజయ్ పై పూరీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అటు విజయ్ మాట్లాడుతూ కూడా  పూరీని ‘నాన్న’ అంటూ సంబోధించడం విశేషం. ప్రస్తుతం వీరి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

నిన్న వరంగల్ లో నిర్వహించిన ‘ఫాండమ్ టూర్’లో పూరీ జగన్నాథ్,  ఛార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలీ, గెటప్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఆడియెన్స్ లైగర్ టీంకు ఘన స్వాగతం పలికింది. ఆగస్టు 25న ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందుతుందని చిత్ర యూనిట్ ప్రామీస్ చేసింది. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు బాలీవుడ్ లోనూ ‘లైగర్’పై హైప్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద లైగర్ సత్తా చూపిస్తుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతుందని తెలుస్తోంది.

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’. విజయ్ దేవరకొండకు హిందీలో ఇది డెబ్యూ ఫిల్మ్. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో  అనన్య టాలీవుడ్ ఎంట్రీతో పాటు.. సౌత్ ఆడియెన్స్ కు పరిచయం కానుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు. కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీలో రూపొందించిన ‘లైగర్’ను తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios