టాలీవుడ్ లో సరికొత్త సినిమాలు చేస్తూ తన డైలాగ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తూ హిట్ సినిమాడు తీస్తున్నాడు ఓ డైరెక్టర్. ఇటీవల నాన్న సెంటిమెంట్ తో సినిమా తీసి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. 

అయితే తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఈ డైరెక్టర్ కి మధ్య అఫైర్ లు నడుస్తుంటాయని టాలీవుడ్ టాక్. గతంలో చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన ఈ దర్శకుడు తాజాగా మరో హ్యాపెనింగ్ బ్యూటీతో కలిసి ఉంటున్నట్లు టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ టాప్ రేసులో దూసుకుపోతున్న ముంబై బ్యూటీతో ఇప్పటికే ఈ డైరెక్టర్ ఓ సినిమా  తీశాడు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ క్లోజ్ అయినట్లు సమాచారం. 

ఇప్పుడు మరో స్టార్ హీరోతో తీయబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా ఆమెనే రిపీట్ చేయాలని చూస్తున్నాడట. ఈ మేరకు హీరోని కూడా ఒప్పించినట్లు సమాచారం. మొత్తానికి ఈ డైరెక్టర్ దయ వలన సదరు హీరోయిన్ మరో పెద్ద సినిమా తన ఖాతాలో వేసుకుంది.