Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli : విరాట్ కొహ్లీ బయోపిక్.. హీరో ఎవరు..? స్పందించిన రణ్ బీర్ కపూర్ కామెంట్స్ వైరల్..

క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు విరాట్ కొహ్లీ. ప్రపంచ కప్ మ్యాచ్ లకు హరీోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం విరాట్ బయోపిక్ మూవీ గురించి బాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. మరి ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా..? 

Star Cricketer Virat Kohli Biopic Ranbir Kapoor Comments Viral JMS
Author
First Published Nov 16, 2023, 2:26 PM IST

చరిత్రాత్మక రికార్డ్ ను క్రియేట్ చేశాడు స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ.  వాంఖడే స్టేడియం విరాట్ వీర బాధుడికి వేదికగా మారింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ యుద్దంలో  టీమ్‌ఇండియా 70 పరుగుల తేడాతో  ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భార‌త జట్టు విజయంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇక ఆ మిగిలిన ఫైనల్స్ లో కూడా గెలిచి కప్ సాధిస్తే.. ఇండియాలో సంబరాలు అంబరాన్ని అంటడం ఖాయం.  ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు కింగ్‌ ఆఫ్ క్రికెట్  విరాట  కోహ్లీ త‌న అద్భుతమైన ఆటతో సచిన్ 49 శతకాల‌ రికార్డును బద్దలు కొట్టాడు. 

అయితే కోహ్లీ 50 శతకాల‌ రికార్డుతో అతనికి సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో విరాట్ బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. క్రికెట్ దేవుడ సచిన్ తో పాటు.. థోని బయెపిక్ మూవీ కూడా వచ్చింది. తాజాగా కపిల్ దేవ్ బయోపిక్ కూడా తెరకెక్కింది. ఇక విరాట్ కొహ్లీ బయెపిక్ పై అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విరాట్  బయోపిక్‌ మూవీ వార్త సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

అంతా బాగానే ఉంది. బాలీవుడ్ లో కోహ్లీ బ‌యోపిక్‌ చేయడానికి ఎవరైనా రెడీ అంటారు.. కాని అందులో హీరోగా నటించేది ఎవరు..? ప్రస్తుతం ఈ ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ విష‌యంపై  తాజాగా స్పందించారు బాలీవుడ్ స్టార్ హీరో.. హ్యాడ్సమ్ స్టార్  రణ్‌బీర్‌ కపూర్. ఈ విషయంలో రణ్‌బీర్‌ కపూర్‌ తన మనసులో మాట చెప్పారు. ముంబాయిలో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ను లైవ్ లో చూసిన రణ్ బీర్. బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు.  ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ యానిమల్‌ సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్‌రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగానే మ్యాచ్‌కు వచ్చాడు రణ్‌బీర్‌. 

ఈ సందర్భంగా ఆయన కోహ్లీ బయోపిక్‌ గురించి మాట్లాడాడు. విరాట్ కోహ్లీ బయోపిక్‌లో మీరు నటించాలని అనుకుంటున్నారా? అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రణ్‌బీర్‌ చక్కటి సమాధానం చెప్పారు. 'కోహ్లీ బయోపిక్‌ సినిమాగా తీస్తే మాత్రం అందులో హీరోగా అతడే నటించాలి. ఎందుకంటే విరాట్‌  ఇండియాలో ఉన్న చాలా మంది నటుల కంటే అందంగా, ఫిట్‌గా ఉంటాడు. అందుకే ఆ పాత్రను కోహ్లీనే పోషించాలి' అని చెప్పాడు. రణ్‌బీర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios