బాలీవుడ్ బ్యూటీతో శుబ్ మన్ గిల్, లండన్ వీధుల్లో జంటగా షికారు....?
సారా టెండుల్కర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట టీమ్ ఇండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్. కాని తాజాతా ఆయన బాలీవుడ్ స్టార్ బ్యూటీతో లండన్ వీధుల్లో షికారు చేస్తున్నాడు. డ్యూయెట్లు పాడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి..?
టీమ్ ఇండియాలో చెలరేగిపోయే బ్యాట్స్ మెన్ శుబ్ మన్ గిల్ కుపేరుంది. చాలా తక్కువ సమయంలోనే టీమిండియాలో స్టార్ స్థాయికి ఎదిగాడు శుబ్ మన్. స్టార్ బ్యాటర్ గా గుర్తింపు తో పాటు..టీమ్ లో తన స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇక ప్రపంచ కప్ తరువాత రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు శుబ్ మన్ గిల్. టీ 20 కి దూరంగా ఉన్నాడు. అయితే ఈ టైమ్ లో ఏం చేస్తున్నాడా అని తన ఫ్యాన్స్ ఆరా తీయ్యడం స్టార్ట్ చేశాడు. కొంపతీసి సారా టెండుల్కర్ తో సరదాగా ట్రిప్ వేశాడా అని డౌట్ కూడా నెటిజన్లకు కలిగింది. అయతే శుబ్ మన్ మాత్రం.. మరోబాలీవుడ్ బ్యూటీతో లండన్ ట్రిప్ లో షికారు చేస్తున్నాడు.
ఎన్టీఆర్ మూవీ లో గుప్పెడంత మనసు జగతీ మేడం, తారక్ తో రొమాన్స్ చేయబోతున్న జ్యోతీరాయ్..?
లండన్ వెళ్లిన గిల్ పక్కన సారా టెండుల్కర్ కనిపిస్తుంది అనుకుంటే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ అవనీత్ కౌర్ కనిపించింది. ప్రస్తుతం వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు వీరిద్దరు లండన్ లో ఎందుకు ఉన్నారు.. ? కారణం ఏంటీ అని ఆరా తీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే.. శుబ్ మన్ గిల్ అనగానే ప్రస్తుతం అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు.. సారా టెండుల్కర్ తో డేటింగ్ కూడా గుర్తుకు వస్తుంది ఫ్యాన్స్ కు. ఎప్పుడూ వీరిద్దరు పై రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఇద్దరు ప్రేమించుకుంటున్నారని.. చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారని వార్తలుహల్ చల్ చేస్తుంటాయి. శుబ్ మన్ బ్యాంటింగ్ చేస్తూ.. కెమెరా కళ్లు ఆ మ్యాచ్ ను వీక్షిస్తున్న సారా టెండుల్కర్ వైపే వెళ్తాయి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ ను క్యాప్చర్ చేస్తుంటాయి. ఈక్రమంలో ఎప్పుడు సారా తో డేటింగ్ వార్తల్లో నిలిచే శుమ్ మన్ గిల్ ఈసారి మాత్రం బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ తో కనిపించి హైలెట్ అవుతున్నాడు. లండన్ లో వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. దీంతో వీళ్లు ఎందుకు కలుసుకున్నారు? కొంపదీసి డేటింగ్ లో ఉన్నారా? అంటూ నెట్టింట రచ్చ మొదలయ్యింది. మరి సారా పరిస్థితి ఏంటీ అంటూ.. ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఇక అసలు విషయం ఆతరువాత తెలిసింది.
అయితే అసలు విషయం ఏంటంటే.. శుబ్ మన్ గిల్, అవనీత్ కౌర్ లు కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారట. ఈ పాట షూటింగ్ కోసం వారిద్దరు లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ పంజాబీ ఆల్బమ్ లో శుబ్ మన్ గిల్, అవనీత్ కౌర్ లు జంటగా ఆడిపాడనున్నారని సమాచారం. వీరితో పాటు ప్రొడ్యూసర్ రాఘవ శర్మ, అన్షుల్ గార్గ్ లు కూడా ఫోటోలలో కనిపిస్తున్నారు. వీరంతా కలిసి దిగిన పిక్స్ కూడా వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.