ఎన్టీఆర్ మూవీ లో గుప్పెడంత మనసు జగతీ మేడం, తారక్ తో రొమాన్స్ చేయబోతున్న జ్యోతీరాయ్..?
కొన్ని కొన్ని షాకింగ్ న్యూస్ లు సడెన్ గా సంచలనం సృష్టిస్తుంటాయి. కొన్ని కాంబినేషన్లు నిజంగానే షాక్ తగిలేలా చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి వైరల్ అవుతోంది. గుప్పెడంత మనసు జగతీ మేడమ్.. గుర్తుంది కదా.. ఆమె టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించబోతుందట..
ఎన్టీఆర్ సినిమాలో గుప్పెడంత మనసు జగతీమేడమ్.. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అసలు ఎక్కడా లింక్ లేని ఈ ఇద్దరు కలిసి ఒక సినిమలో నటించం ఏంటీ అని ఆశ్చర్యంగా ఉంది కదా..? అవును తారక్ సినిమాలో జ్యోతీరాయ్ నటించబోతుందంటూ అటు కన్నడ నాట. ఇటు తెలులో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో నిజం ఎంత..?
Jyothi rai
గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది జ్యోతీరాయ్. ఈసీరియల్ లో జగతీమేడమ్ పాత్రలో అద్భుతం చేసింది. రిషి తల్లిగా ఆమె పండించిన సెంటిమెంట్ కు.. తెలుగు కుటుంబ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిండుగా చీర కట్టుకుని.. పెద్ద బొట్టు పెట్టుకుని... జగతీ పాత్రలో జ్యోతీ రాయ్ చాలా బాగా నటించారు.
అయితే బయట మాత్రం..జ్యోతీరాయ్ ను చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఆమె పాత్రలోనుంచి బయటకు వస్తే.. ఫ్యాషన్ వేర్ లో కనిపిస్తారు. ఇన్ స్టాలో జగతీమేడమ్ చేసే ఫోటో షూట్లు షాకింగ్ గా ఉంటాయి. అందాలు ఆరబోస్తూ.. సొగసులు ఊయ్యాల ఊపుతూ.. జ్యోతీరాయ్ అలియాస్ జగతీ మేడమ్ అదరగొడుతుంటుంది.
Jyothi Rai
ఆమె బుల్లితెరను వీడి.. వెండితెరపై సందడి చేయడం కోసం.. గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది. అసలు ఆమె పాత్రనే చంపేశారు దర్శకుడు. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, కన్నడ సినిమలతో బిజీ అయిపోతోంది జ్యోతీరాయ్. అంతే కాదు ఏమాత్రం మొహమాటపడుకుండా... ఎద అందాలు, థైస్ మోరుపులు.. నడుము.. నాభి అని తేడా లేకుండా చూపించాల్సినవన్నీ చూపించేస్తోంది.
ఇక ఆమె పెళ్లై విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్లకు దగ్గరగా ఉన్న జ్యోతీరాయ్.. దర్శకుడు సుకు పూరాజ్ తో డేటింగ్ లో ఉంది. వారిద్దరు కలిసి తిరుగుతూ.. ఫోటోలు దిగుతూ.. నెట్టింట సందడి చేస్తుంటారు. ఈక్రమంలో ఎన్టీఆర్ సినిమాలో జ్యోతీరాయ్ నటించబోతున్నట్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది న్యూస్.
jyothi rai
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా బిజీలో ఉన్నాడు. ఈమూవీ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈసినిమాలో జ్యోతీరాయ్ ను కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. జ్యోతీరాయ్ ప్రియుడు సుకు పూరాజ్.. ప్రశాంత్ నీల్ కు మంచి ఫ్రెండ్ కావడంతో.. తన ప్రియురాలిని ఆ సినిమాలో తీసుకోవల్సిందిగా సజెస్ట్ చేశారట. దాంతో ఆమె ఈ మూవీలో నటించడం ఫిక్స్ అని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాలో జ్యోతీరాయ్ కు మంచి గ్లామర్ రోల్ ను ఇవ్వలాని ప్రశాంత్ నీల్ అనుకున్నారట. అయితే స్పెషల్ సాంగ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. సాంగ్ లో హాట్ హాట్ గా జ్యోతీరాయ్.. ఎన్టీఆర్ తో ఘాటు రొమాన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి తారక్ సినిమాలో జగతీమేడమ్ పాత్ర నిజంగా ఉంటుందా.. లేకు ప్రపోజల్ వరకే ఆగిపోతుందా.. ? అసలు ఇందులో నిజం ఉందా లేదా అనేది చూడాలి.