Asianet News TeluguAsianet News Telugu

కూతురు పేరును రివీల్ చేసిన అలియా భట్ - రన్బీర్ కపూర్.. తండ్రి పేరు కలిసేలా నామకరణం.!

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్ - రన్బీర్ కపూర్ ఇటీవలనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బేబీకి నామాకరణం చేశారు. అయితే, పేరును ఎంపిక చేయడంలో రన్బీర్ కపూర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు.
 

Star couple Alia Bhatt - Ranbir Kapoor revealed the name of her daught
Author
First Published Nov 25, 2022, 11:01 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) - స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) దాదాపు ఐదేళ్లు ప్రేమలో ఉండి.. ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 6న పండంటి ఆడబిడ్డకు అలియా జన్మనిచ్చింది. 

రన్భీర్ కపూర్ - అలియా తల్లిదండ్రులు కావడంతో సినీ ప్రముఖులు, స్టార్స్, అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. పాపా పుట్టాక వీరికి అన్నీ శుభపరిణామాలే జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా పాపాకు ఏ పేరుతో నామకరణం చేశారో రివీల్ చేశారు. రహా (Raha) అని నామకరణం చేసినట్టు తెలిపారు. రహా.. అంటే అద్భుతం, ఆనందం, ఆహ్లాదం అనే అర్థాన్ని కూడా వివరించింది. పాపా రాకతో తమ ఇంట్లో మరింత సుఖ:సంతోషాలు వెల్లువిరుస్తున్నాయని అలియా భట్ సోషల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.

అయితే, పాపకు నామాకరణం చేయడం విషయంలో రన్బీర్ కపూర్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి, దివంగత స్టార్... రిషి కపూర్ (Rishi Kapoor) గుర్తుగా తమ పాపకి రిషి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలని భావించారు. అలాగే పూర్తిగా ఆ పేరు  పెట్టకపోయినా.. తొలి అక్షరం కలిసేలా నామకరణం చేయడం విశేషం. ఇక నిక్ నేమ్ విషయంలో మాత్రం అలియా ‘అరా’ అని పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి బేబీ నేమ్ ను రివీల్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios