స్టాండప్ కమెడియన్ గా చెన్నైకి చెందిన మంజునాథ్ నాయుడు గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మంజునాథ్ నాయుడు వయసు 36 ఏళ్ళు. ప్రస్తుతం మంజునాథ్ నాయుడు దుబాయ్ లో ఉంటున్నారు. అక్కడే ఓ కార్యక్రమంలో పెర్ఫామెన్స్ ఇస్తుండగా వేదికపైనే గుండెపోటుతో మృతి చెందాడు. 

ఈ సంఘటనతో మంజునాథ్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న ప్రేక్షకుల్లో కూడా విషాదం నెలకొంది. మంజునాథ్ కు గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం జరగడం వల్ల అతడి ప్రాణాలు పోయినట్లు చెబుతున్నారు. 

రాత్రి 11 గంటల సమయంలో మంజునాథ్ నాయుడు స్టేజిపై తన స్కిట్ ప్రారంభించాడు. స్కిట్ మధ్యలో కుప్పకూలిపోవడంతో అందరూ నటనలో భాగమేమో అని అనుకున్నారు. ఈ పొరపాటే మంజునాథ్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది. వేగంగా స్పందించి ఆసుపత్రికి తరలించి ఉంటె పరిస్థితి వేరేలా ఉండేది. ఆలస్యంగా ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మంజునాథ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.