వాల్తేర్ వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న వాల్తేర్ వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా.. చిన్నారులు కిందపడిపోయారు

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న వాల్తేర్ వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. చిరంజీవి అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా గేట్లను తోసుకుని అభిమానులు ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా.. చిన్నారులు కిందపడిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.