రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు.
యూట్యూబ్, వెబ్ మీడియాలో వచ్చే వార్తలు కొన్ని ఇంట్రస్టింగ్ గా ఉన్నా,వాటికి తలా తోకా ఉండదు. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి మీడియా వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానున్నదన్న విషయం చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నారుతెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, అసలు రాజమౌళి స్టోరీ తయారు చేసారా.. ఆ సినిమా లైన్ ఏంటనేది తెలీదు. అయితే ఇప్పటికే ఈ సినిమాపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం కథను సిద్దం చేసి చెప్పేసాడని, అందులో సూపర్ స్టార్ మహేష్ చేయనున్నాడని వార్తలు మొదలెట్టేసారు.
గతంలోనూ రాజమౌళి, మహేష్ కాంబోపై అనేక రూమర్లు వచ్చాయి. జేమ్స్ బాండ్ గా చేస్తున్నాడని ఓ సారి..మరోసారి కౌబాయ్ సినిమా అని..ఇలా వరస పెట్టి వార్తలు రాసేసారు. ఇదే తరహాలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రాజమౌళి తన సినిమా ఛత్రపతి శివాజి ఆధారంగా చేయనున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడట. ఇందులో శివాజీ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ కనిపించనున్నాడట. ఈ విధంగా వార్తలు ప్రచారం మొదలెట్టారు. అసలు రాజమౌళి కు ఖాళీ ఎక్కడుంది. ఆర్ ఆర్ ఆర్ బిజీలో ఉన్నాడు అని కూడా ఆలోచించలేదు.
ఇంకొందరు అయితే రాజమౌళి మహేష్‌తో చేయనున్న సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని కూడా ఆ వార్తకు మసాలా యాడ్ చేసేసారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ టైగర్ ఎన్‌టీఆర్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నాడు. అదేవిధంగా మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి వీరి కాంబో ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అప్పటిదాకా ఇలాంటి వార్తలు ఎన్ని చూడాలో.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 19, 2021, 8:34 AM IST