దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి RRR సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా 400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ స్థాయికి సినిమా చేరుకోవాలంటే ఎంత ఆలోచించినా సరిపోదేమో. 

కాని జక్కన్న మాత్రం డిఫరెంట్ ఆలోచనలతో కూల్ గా అలోచించి తెరపై స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేస్తారు. అదే విషయాన్నీ జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. తుపాను  సృష్టించే మనిషి ప్రశాంతంగా ఉంటే ఇలా ఉంటుందని అర్ధం వచ్చేలా తారక్ స్పెషల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. 

ప్రస్తుతం బల్గెరియాలో సినిమాకు సంబందించిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తారక్ పాత్ర కోసం ఈ షెడ్యూల్ ని స్పెషల్ గా ప్లాన్ చేశారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా దర్శనమివ్వనున్నాడు.   

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The MAN before The STORM! #RRR

A post shared by Jr NTR (@jrntr) on Aug 27, 2019 at 10:19am PDT