Asianet News TeluguAsianet News Telugu

RRR బాలీవుడ్ సినిమా కాదు, పక్కా తెలుగు సినిమా, అమెరికాలో గర్వంగా చెప్పిన రాజమౌళి..

తెగులు సినిమా పరువు మరోసారి నిలబెట్టాడు రాజమౌళి. మన సినిమాను అవమానించినవారు తలదించుకునేలా సమధానం చెప్పారు. ఆర్ఆర్ఆర్ పక్కా తెలుగు సినిమా.. ఇది బాలీవుడ్ సినిమా కాదు అంటూ క్లారిటీ ఇచ్చి పడేశాడు. 
 

SS Rajamouli says RRR not bollywood film its telugu movie
Author
First Published Jan 15, 2023, 3:26 PM IST


ఎన్టీఆర్,  రామ్ చరణ్  హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  RRR సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. భారీ కలెక్షన్లతో పాటు.. హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించిన ఈ సినిమా.. తన విజయ ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. హాలీవుడ్ లో మరింత పాపులారిటీ సాధిస్తోంది మూవీ.. వరుస గౌరవాలు సాధిస్తుండటంతో.. వాటిని అందుకోవడం కోసం రాజమౌళి కొంత కాలంగా ఫారెన్ టూర్లలోనే ఉంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంకా  ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గెలుచుకుంది. ఈ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు  దేశమంతా అభినందనలు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి..ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు కూడా టీమ్ ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. చెప్తున్నారు. ఇక ఇప్పటికే RRR సినిమా, నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లో నిలిచాయి. ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR ని మరింత ప్రమోట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.

ఈ సందర్భంగా రాజమౌళి వరుసగా... అమెరికాలోని మీడియా సంస్థలతో, సినిమా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి  ఓ కార్యక్రమంలో RRR సినిమా విశేషాలను పంచుకున్నారు జక్కన్న. అంతే కాదు ఈసందర్భంలో అక్కడి వారు ఆర్ఆర్ఆర్ సినిమాను  బాలీవుడ్ సినిమా అంటూ చెప్పడంతో.. రాజమౌళి దానిపై క్లారిటీ ఇచ్చాడు.ఆయన మాట్లాడుతూ RRR సినిమా బాలీవుడ్ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, నేను అక్కడి నుంచే వచ్చాను అని చెప్పారు. 

ఇది పక్కా టాలీవుడ్  ఫిల్మ్ .. అంటూ రాజమౌళి చెప్పడంతో.. మరోసారి తెలుగు సినిమా గౌరవాన్ని.. టాలీవుడ్ పరువును జక్కన్న తలఎత్తుకుని నిలబడేలా చేశాడు. రాజమౌళి RRR సినిమాని తెలుగు సినిమా అంటూ గర్వంగా చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావాలని  ఇండియన్స్.. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు మనస్పూర్తిగా కోకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే ప్రత్యేక పూజలు కూడా జరుపుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios