రివర్స్ అయిన రాజమౌళి ట్వీట్, పెయిడ్ అంటూ పరువు తీస్తున్నారు
తమ ఫ్యామిలీనుంచి వస్తున్నవి తప్పించి బయటి సినిమాల గురించి రాజమౌళి పెద్దగా మాట్లాడడు. తనకూ, తన సినిమాలకూ సంబంధం లేని వ్యక్తుల గురించీ, వాళ్ల సినిమాల గురించీ అస్సలు పట్టించుకోడు.

మంచికి పోతే చెడు ఎదురైందనే సామెత కొన్ని సార్లు చాలా మంది విషయంలో నిజమవుతుంది. తాజాగా రాజమౌళి సైతం అలాంటి ఓ నెగిటివిటిని చవి చూసారు. ఆయన ఓ చిన్న సినిమాను ప్రమోట్ చేద్దామని చేసిన ట్వీట్ రివర్స్ లో ఆయన్ని చాలా మంది చేత తిట్టిపోసేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వచ్చిన తాజా చిత్రం. మేం ఫేమస్. తమకు ఉన్న అన్ని వనరలను ఉపయోగించి ఈ సినిమా ప్రమోషన్లను చాలా భారీగా చేశారు. పబ్లిసిటీని చూస్తే అది ఓ .. చిన్న సినిమా, కొత్త వాళ్లతో తీసిన సినిమా అని ఎక్కడా అనిపించని విధంగా ప్రమోట్ చేసారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు సైతం విడుదలకు ముందు ఈ సినిమా గురించి పాజిటీవ్ ట్వీట్ వేయటం కలిసొచ్చింది. అలాగే ఆ తర్వాత స్టార్ డైరక్టర్ రాజమౌళి వంతు వచ్చింది. తమ ఫ్యామిలీనుంచి వస్తున్నవి తప్పించి బయటి సినిమాల గురించి రాజమౌళి పెద్దగా మాట్లాడడు. తనకూ, తన సినిమాలకూ సంబంధం లేని వ్యక్తుల గురించీ, వాళ్ల సినిమాల గురించీ అస్సలు పట్టించుకోడు.
ఎప్పుడైనా ఒకటీ అరా ట్వీట్ వేస్తే.. అది నాని సినిమానే అయ్యి ఉంటుంది. అదీ ఈమధ్య జరగలేదు. అయితే చాలా కాలం తరవాత.. ఓ సినిమా చూసి, బాగుందంటూ మెచ్చుకొని ట్వీట్ కూడా చేశాడు రాజమౌళి. మేం ఫేమస్ సినిమా తనకు బాగా నచ్చిందని, చాలా కాలం తరవాత థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు రాజమౌళి. దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ కి మంచి మార్కులు వేశాడు. తన ప్రతిభ ఆకట్టుకొందంటూ మెచ్చుకొన్నాడు. అన్ని పాత్రలూ నచ్చాయని చెప్పిన రాజమౌళి.. ప్రధానంగా అంజిమామ పాత్రకు ఇంకొన్ని ఎక్కువ మార్కులేసారు. ఈ సినిమాని హైలీ రికమెండెడ్ లిస్టులో చేర్చేశాడు రాజమౌళి.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే సినిమా రాజమౌళి మెచ్చుకున్న స్దాయిలో లేదు.రిలీజైన రోజున ఈ సినిమాపై నెగిటీవ్ బజ్ నడిచింది. రివ్యూలూ అలానే వచ్చాయి. కానీ మహేష్, రాజమౌళి సెలబ్రెటీలు మాత్రం వరుస ట్వీట్లతో హోరెత్తించడం చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.మరికొందరు పెయిడ్ రివ్యూలంటూ రాజమౌళిని విమర్శించారు. మరికొందరైతే రాజమౌళికు అంతకు ముందు వచ్చిన బలగం సినిమా గొప్పగా కనిపించలేదా అంటూ నిలదీసారు. అలా చాలా మంది రాజమౌళిని ఇలా మీరు కూడా భజన చేస్తారని ఊహించలేదని డైరక్ట్ గా అన్నారు. మరికొందరైతే మీ మాట నమ్మి సినిమాకి వెళ్లాం అక్కడ అంత సీన్ లేదని డైరక్ట్ గా ఎటాక్ చేసినంత పనిచేసారు. ఏదైమైనా రాజమౌళి తన ట్వీట్ ఇలా రివర్స్ అవటం మాత్రం ఏ మాత్రం ఊహించని పరిణామమే.