Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli: రాజమౌళి పొరపాటున కూడా ఆ రిస్క్ తీసుకోరు..అది రూమరే

 తాజాగా రాజమౌళి నెక్ట్స్ సినిమా గురించి ఓ వార్త మీడియాలో,ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే అంత రిస్క్ తీసుకోరని అంటున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటి..

SS Rajamouli dont take That Risk..on his next with Mahesh Babu
Author
First Published Nov 21, 2022, 4:28 PM IST

రాజమౌళి కెరీర్ ఈ రోజు పీక్స్ లో ఉందంటే అందుకు కొన్ని లెక్కలు ఉన్నాయి..తనపై ఉన్న అంచనాలను అందుకోవటానికి ఆయన నిరంతరం చేసే కృషి ఉంది. తన సినిమాకు సంభందించిన టీమ్ ఎంపిక దగ్గర నుంచి లాస్ట్ ప్రమోషన్ మెటీరియల్ దాకా రాజమౌళి కను సన్నులలోనే జరుగుతుంది.అందుకే ఆయన మాస్టర్ మేకర్ అయ్యారు. కాబట్టి ఆయన సినిమాలకు సంభందించిన ప్రతీ విషయం సెన్సేషన్ అవుతుంది. తాజాగా రాజమౌళి నెక్ట్స్ సినిమా గురించి ఓ వార్త మీడియాలో,ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే అంత రిస్క్ తీసుకోరని అంటున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటి..

రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఎడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించిన కథ రెడీ అవుతోంది. అయితే అదే సమయంలో ఈ సినిమాకు అనిరిధ్ సంగీతం అందించబోతున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ తమిళ దర్శకుడు మాస్ కమర్షియల్ మూవీస్ బిజీఎం కు పెట్టింది పేరు. ఇప్పుడు ఆయన కొరటాల శివ డైరక్షన్ లో రూపొందుతోన్న  NTR30 సినిమాకు పనిచేస్తున్నారు. దాంతో ఈ వార్త రాగానే కొందరు అదే మ్యూజిక్ డైరక్టర్ ని మహేష్ బాబు SSMB29 సినిమాకు పెట్టారని ప్రచారం మొదలెట్టారు. అయితే ఎట్టి పరిస్దితుల్లోనూ కీరవాణిని వదిలి రాజమౌళి మరొక మ్యూజిక్ డైరక్టర్ ని ఎంచుకోరనేది బహిరంగ రహస్యం. తనను సక్సెస్ బాటలో నడిపిస్తున్న సొంత టీమ్ ని వదిలేసి రాజమౌళి అలాంటి సాహసం చెయ్యరనేది నిజం. మరొక మ్యూజిక్ డైరక్టర్ తో సినిమా చేయటమే రిస్క్ ఆయన చేయరని ఆయన సన్నిహితులు ఖచ్చితంగా చెప్తున్నారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని కే.ఎల్ నారాయణ తన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మే  లేదా జూన్  2023 లాంచ్ జరుగుతుంది. 
 
 సినిమా కథ గురించి రాజమౌళి మాట్లాడుతూ... "మా నాన్నగారు విజయంద్రప్రసాద్...నా సినిమాలన్నిటికి కథలు రాస్తూంటాు. ఆయన ,నా కజిన్ కాంచి,,నేను కలిసి ఓ కథను గత కొద్ది రోజులుగా డవలప్ చేస్తున్నాము. అదో ఎడ్వెంచర్ కథ. నేను చాలాకాలంగా ఇలాంటి కథ చేయాలనుకుంటున్నాను. ఇండియానా జోన్స్ తరహా కథ అది. నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇండియనా జోన్స్. ఆ సినిమాని నాకు ఇష్టమైన ...డానీ బ్రౌన్ నవల తరహాలో నేరేట్ చేస్తాను.  గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” గా   ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఇదంతా ఎర్లీ రైటింగ్ స్టేజెస్ లో ఉంది" అని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios