రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనం తాజాగా రాజమౌళి ఫామ్ హౌజ్ పనుల్లో బిజీగా వుండటంతో ఆలస్యం ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ రెడ్డికి ఫామ్ హౌజ్ నిర్మాణ పనుల బాధ్యతలు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి’ మూవీతో నేషనల్ సెలెబ్రిటీగా మారిపోయిన దర్శకుడు రాజమౌళి గురించి ఏ సమాచారమైనా హాట్ టాపిక్ గా మారుతోంది. రాజమౌళి తన లేటెస్ట్ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో అనే విషయం పై క్లారిటీ లేకపోయినా నల్గొండ సమీపంలో విజయవాడ హైవేకి దగ్గరగా రాజమౌళి ఎంతో ముచ్చటపడి నిర్మించుకుంటున్న ఫామ్ హౌస్ కు సంబంధించిన పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ కు సంబంధించిన వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలలో సంచలన వార్తలుగా మారుతున్నాయి. దాదాపు 120 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఫామ్ హౌస్ డిజైన్ పర్యవేక్షణ బాధ్యతలను జాతీయ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ అయిన రవీందర్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫాం హౌజ్ లో 50 ఎకరాలలో మామిడితోట మరో 50 ఎకరాలలో సపోటతోట పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. ఇక మిగిలిన భూమిలోని ఒక ఎకరంలో ఒక పెద్ద బంగ్లాను కట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆ ఇంటి చుట్టూ అందమైన పూల తోటలతోపాటు రాజమౌళి ఇంటి పక్కన చిన్నచిన్న కుటీరం లాంటి ఇళ్లను కూడ నిర్మిస్తారట ఇంకా మిగిలిన ప్రాంతంలో పశువుల పాకలు పశుగ్రాసం కోసం కొంత భూమిని కేటాయించారు అని టాక్. అంతేకాదు కేవలం ఇళ్లే కాకుండా లోపల ఒక్కొక్క చోటికి దారులు ఎలా ఉండాలనేది అనే డిజైన్ కూడ రాజమౌళి పక్కాగా వేయించినట్లు తెలుస్తోంది. 

దారుల సంగతి అలావుంటే ఇళ్ళు, బంగ్లాల డిజైన్స్ చిన్న సైజు మహిష్మతి సామ్రాజ్య లుక్ లో ఉంటే వ్యవసాయం చేసే పొలం పశువులు కుటీరాలలో తన మర్యాద రామన్నలోని సహజత్వాన్ని మేళవించి ఉండే విధంగా రాజమౌళి ప్లాన్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఒక వైపు అమరావతి రాజధాని డిజైన్ల హడావిడితో పాటు తన సొంత ఫామ్ హౌస్ డిజైన్స్ బిజీలో రోజులు గడుపుతున్న రాజమౌళి మధ్యలో తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నాడు..