బోయ్ ఫ్రెండ్ మైకేల్ ను తల్లి సాగరికకు పరిచయం చేసిన శృతి

First Published 1, Dec 2017, 11:25 AM IST
sruthi haassan introduces her boy friend to mom sagarika
Highlights
  • రీసెంట్ గా శృతీహాసన్ ప్రేమ వ్యవహారంపై హాట్ డిస్కషన్
  • లండన్ బోయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సల్ తో తరచూ శృతి  చెట్టాపట్టాల్
  • తాజాగా తన తల్లి సాగరికకు మైకేల్ ను పరిచయం చేసిన శృతి,పిక్ వైరల్

సౌత్ హాట్ యంగ్ హీరోయిన్స్ లో శృతీ హాసన్ ముందుంటుంది. తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న శృతీ ఇటీవల సినిమాలు పక్కకుబెట్టి తన పని తాను చూసుకుంటోంది. తన పని అంటే.. అదేదో బిజినెస్ అనుకునేరు. తన పర్సనల్ పని. లవ్ మేటర్. శ్రుతి హాసన్ ప్రేమ కబుర్లు ఎప్పుడూ హాట్ టాపిక్ నే.

 

తాను ప్రేమలో వున్నాానని స్వయంగా శ్రుతినే అంగీకరించింది. లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సలేతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న శృతీహాసన్ చాలాసార్లు మైఖేల్‌ను ముంబయికి కూడా తీసుకువచ్చింది . అయితే ఇప్పుడు విశేషమేంటంటే... శృతి తాజాగా తన తల్లి సారికకు మైకేల్ ను పరిచయం చేసిందట.

 

మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రుతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శృతి పరోక్షంగా ప్రేమ విషయాన్ని చెప్పినా.. ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేసింది. త్వరలో పెళ్లి చేసుకునేందుకే శృతీ రెడీ అవుతున్నట్టు చెన్నయ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

loader