పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్న చిత్రం మాత్రం ఓజి అనే చెప్పాలి.  డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్న చిత్రం మాత్రం ఓజి అనే చెప్పాలి. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఓజి చిత్రానికి ఆరంభంలోనే ఆకాశాన్ని తాకే హైప్ నెలకొంది. ఓజి, సలార్ లాంటి చిత్రాల్లో భాగం కావడంతో శ్రీయ రెడ్డి ప్రస్తుతం క్రేజీ నటిగా మారిపోయింది. 

సలార్ లో శ్రీయ రెడ్డి రాధారమ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించింది. ఆమె గెటప్ కూడా అందరిని ఆర్షించింది. సలార్ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తుండడంతో శ్రీయ రెడ్డికి క్రేజ్ పెరిగింది. ఇక ఆమె పాత్ర పవన్ కళ్యాణ్ ఓజి లో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీయ రెడ్డి ఓజి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ లీక్ చేసింది. 

View post on Instagram

తాను ఓజి లో చేస్తోంది విలన్ రోల్ కాదు అలాగని నెగిటివ్ రోల్ కూడా కాదు. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి అని పేర్కొంది. సుజీత్ అద్భుతమైన కథ రెడీ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం మాత్రం ఖాయం అంటూ శ్రీయ రెడ్డి కామెంట్స్ చేసింది. నేను ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజి గురించి అడుగుతున్నారు. మా దేవుడితో నటిస్తునావు కదా అని అంటున్నారు. ఆయన క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అని శ్రీయ రెడ్డి తెలిపింది.